Supreme Court : ఫ్యామిలీ కోర్టుల్లో ‘హైబ్రిడ్’ విచారణ పద్ధతులు.. ‘పిల్‌’‌పై ‘సుప్రీం’ కీలక నిర్ణయం

by Hajipasha |
Supreme Court : ఫ్యామిలీ కోర్టుల్లో ‘హైబ్రిడ్’ విచారణ పద్ధతులు.. ‘పిల్‌’‌పై ‘సుప్రీం’ కీలక నిర్ణయం
X

దిశ, నేషనల్ బ్యూరో : దేశంలోని ఫ్యామిలీ కోర్టులలో కేసుల విచారణను బహుళ (హైబ్రిడ్) పద్ధతుల్లో నిర్వహించే అంశాన్ని పరిశీలించాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) సుప్రీంకోర్టు సోమవారం విచారించింది. ఈ పిల్‌పై న్యాయ విచారణ నిర్వహించేందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సారథ్యంలో ధర్మాసనం అంగీకరించింది. దీనిపై స్పందన తెలియజేయాలంటూ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు నోటీసులు జారీ చేసింది. ఆరువారాల్లోగా స్పందనను తెలియజేయాలని వాటికి సుప్రీంకోర్టు బెంచ్ నిర్దేశించింది.

పిటిషనర్ తరఫున న్యాయవాది కేసీ జైన్ వాదనలు వినిపిస్తూ.. ‘‘ఫ్యామిలీ కోర్టుల్లో ఎలక్ట్రానిక్ విచారణ పద్ధతులను కూడా అందుబాటులోకిి తేవాలి. దీనివల్ల ఆయా కేసుల్లో ఉన్న అన్ని పక్షాలకు రవాణా సమయం ఆదా అవుతుంది. సుదూరాలకు ప్రయాణం చేయాల్సిన అవసరం తప్పుతుంది. కూర్చున్న చోటు నుంచే తన వాణిని వినిపించే వెసులుబాటు కలుగుతుంది’’ అని తెలిపారు. ఫ్యామిలీ కోర్టుల్లో విచారణకు వచ్చే కేసుల పరిష్కారంలో జరుగుతున్న జాప్యం ప్రభావం ప్రధానంగా పిల్లలు, మహిళలపై పడుతోందని న్యాయవాది కేసీ జైన్ కోర్టుకు తెలిపారు. ఎలక్ట్రానిక్ విచారణ పద్ధతులు సైతం అందుబాటులోకి వస్తే పిల్లలు, మహిళలు, వృద్ధులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందన్నారు.

Advertisement

Next Story

Most Viewed