- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
హిజ్బుల్లా ఆర్థిక మూలాలపై ఇజ్రాయెల్ దాడి
దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయెల్ సోమవారం లెబనాన్ పై విరుచుకుపడింది. హిజ్బుల్లా అనుబంధ బ్యాంకు ఖర్ద్ అల్ హాసన్ కార్యాలయాలపై బాంబులు కురిపించింది. సుమారు ఓ డజన్ గగనతల దాడులు చేపట్టింది. ఈ దాడులతో బీరూట్ నగరం దద్దరిల్లింది. దేశంలోని ఏకైక వాణిజ్య విమానాశ్రయానికి కొన్ని వందల మీటర్ల దూరంలో ఈ దాడులు జరగడం గమనార్హం. ఒక వైపు టార్మాక్ పై విమానాలు పరుగులు పెడుతుంటే మరోవైపు బాంబుల వల్ల ఆకాశంలో ఏర్పడ్డ దట్టమైన పొగ కనిపించింది.
హిజ్బుల్లా ఆర్థిక మూలాలపై దాడి చేసి దాన్ని ఆర్థికంగా బలహీనం చేయాలని తాము ఈ దాడులు చేసినట్టు ఇజ్రాయెల్ వెల్లడించింది. హిజ్బుల్లా దాని ఫైటర్లకు ఖర్ద్ అల్ హాసన్ బ్యాంకు ద్వారానే జీతాలు వేస్తుందని తెలిపింది. ఇదే బ్యాంకు కార్మికవర్గ షియా ముస్లిం కుటుంబాలకు కూడా వడ్డీలేని రుణాలను ఇస్తుంది. ప్రజా సొమ్మును దోచుకునే ప్రభుత్వ అసమర్థత వల్ల హిజ్బుల్లా బలంగా సమాజంలో చొచ్చుకుపోయింది. ముఖ్యంగా షియా కమ్యూనిటీలో హిజ్బుల్లాకు కొంత ఆదరణ లభించిందని చెబుతారు. లెబనాన్‌లో సాధారణ సమాజానికి అందుబాటులో ఉండే చాలా సదుపాయాలు.. హిజ్బుల్లా కూడా అందుబాటులో ఉన్నాయని పేర్కొంటున్నారు. కాబట్టి, ఇప్పుడు ఇజ్రాయెల్ దేని మీద దాడి చేసినా అది హిజ్బుల్లాను దెబ్బతీయడానికే అని సాకు చెప్పడానికి ఆస్కారం ఉన్నది. ఇది ఒకరకంగా అక్కడి సామాన్య ప్రజలను నష్టపరుస్తుంది, లబ్ది చేకూరుస్తుంది కూడా.
ఇజ్రాయెల్ అమ్ముల పొదిలో థాడ్
ఇజ్రాయెల్‌పై ఎన్ని క్షిపణి దాడులు చేసినా ఐరన్ డోమ్ ఆ దేశాన్ని ఇన్నాళ్లు సురక్షితంగా ఉంచింది. కానీ, దానికీ కొన్ని పరిమితులు ఉన్నాయి. ఆ పరిమితులను దాటి దాడి చేస్తే ఎదుర్కోవడం సాధ్యం కాదని ఇటీవలి ఘటనలు తేల్చాయి. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్‌కు అండగా నిలబడటానికి అమెరికా ఆ దేశానికి టర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్ సిస్టమ్(థాడ్)ను అందించింది. ఇప్పుడు ఈ థాడ్ సిస్టమ్‌ను ఇజ్రాయెల్‌లో అమర్చినట్టు అమెరికా రక్షణ మంత్రి ఆస్టిన్ లాయిడ్ వెల్లడించారు. స్వల్ప సమయంలోనే దాన్ని ఉపయోగించడానికి సిద్ధం చేయవచ్చునని తెలిపారు. థాడ్ వెంట 100 మంది అమెరికా సైనికులను పంపించామని, వారు ఇజ్రాయెల్ డిఫెన్స్‌కు సహకరిస్తారని చెప్పారు.