చైనాలో మోడీని ఏమని పిలుస్తారో తెలుసా?

by samatah |   ( Updated:2023-03-20 07:13:32.0  )
చైనాలో మోడీని ఏమని పిలుస్తారో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్ : చైనాలో మోదీకి విశేష ఆదరణ ఉన్నట్లు అమెరికన్ మ్యాగజైన్ ది డిప్లోమాట్ వెళ్లడించింది. అలాగే మోడీని అక్కడి వారు మోదీ లాక్షియన్ అని గౌరవప్రదంగా పిలుస్తారంట.

ఇతర నాయకుల కంటే చైనా నెటిజన్లు మోదీ భిన్నమైనవారని, అందరికంటే వినూత్నంగా అద్భుతంగా ఉంటారని చైనీయులు భావిస్తారంట. లావోసియన్ లాగా కనిపించే అతని దుస్తులు, శారీరక రూపాన్ని,భారతదేశానికి భిన్నమైన అతని కొన్ని విధానాలను వారు సూచిస్తున్నారు. ఇతర ప్రధాన దేశాలతో భారతదేశ సంబంధాలపై, రష్యా, యునైటెడ్ స్టేట్స్ లేదా గ్లోబల్ సౌత్ దేశాలు అయినా, భారతదేశం వాటన్నింటితో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగిస్తుందని చైనీయులు భావిస్తున్నారంట.అందుకే మోడీని లాక్షియన్ అనింటారంట. లాక్షియన్ అంటే అసాధరణమైన, శక్తివంతమైన వ్యక్తి అని అర్థం. వస్త్రధరణ, విధానాలు ఇలా అనేక అంశాల్లో ఆయన ఇతరులకంటే భిన్నంగా ఉంటారని చైనీయులు భావిస్తున్నారని అమెరికన్ దేశ జర్నలిస్ట్ ము షుంషాన్ పేర్కొన్నారు.

Also Read..

పాక్ మాజీ ప్రధానిపై ఉగ్రవాద అభియోగాలతో కేసు

Advertisement

Next Story