- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
AIని వాడుకుని భారత ఎన్నికలకు ఆటంకం కలిగించాలని చూస్తున్న చైనా: మైక్రోసాఫ్ట్
దిశ, నేషనల్ బ్యూరో: ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ ఎన్నికలు తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశం ఉందని గత కొంత కాలంగా నిపుణులు, రాజకీయ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే తాజాగా టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఈ విషయంలో ఒక నివేదికను విడుదల చేసింది. దీనిలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత కంటెంట్‌ను ఉపయోగించి భారత సార్వత్రికలకు ఆటంకం కలిగించడానికి చైనా సిద్దమవుతుందని మైక్రోసాఫ్ట్ భారత్‌ను హెచ్చరించింది. ఇంతకుముందు తైవాన్ అధ్యక్ష ఎన్నికల సమయంలో చైనా ఈ విధమైన ప్రయత్నాలు చేసిందని నివేదిక పేర్కొంది.
మైక్రోసాఫ్ట్ ఇంటెలిజెన్స్ బృందం పేర్కొన్న దాని ప్రకారం, ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న భారత్, అమెరికా, దక్షిణ కొరియాలో చైనా తన ప్రయోజనాల కోసం ఎన్నికలకు ఆటంకం సృష్టించడానికి AI- రూపొందించిన కంటెంట్‌ను వివిధ సోషల్ మీడియా యాప్స్‌లలో షేర్ చేసే అవకాశం ఉంది. డీప్‌ఫేక్‌లు, వాయిస్ క్లోనింగ్, తప్పుడు కంటెంట్ వ్యాప్తి చేయడానికి ఇప్పటికే అన్ని సిద్ధం చేసుకుందని ఇంటెలిజెన్స్ బృందం హెచ్చరించింది. తైవాన్‌లో జరిగిన అధ్యక్ష ఎన్నికల సమయంలో స్టార్మ్ 1376 లేదా స్పామౌఫ్లేజ్ అని పిలువబడే చైనా బృందం ఫేక్ ఆడియోలు, మీమ్‌లు, ఫొటోలు, వీడియోలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సృష్టించి కొంత మంది అభ్యర్థులను కించపరచడం, ఓటరు అవగాహనలను ప్రభావితం చేయడం వంటివి చేశారని మైక్రోసాఫ్ట్ తెలిపింది.
ఇప్పుడు ఇదే విధమైన పద్ధతిని ఉపయోగించి భారత్‌లో కూడా ఎన్నికలను ప్రభావితం చేయాలని చైనా చూస్తుందని హెచ్చరించింది. దీనిలో చైనాతో పాటు ఉత్తర కొరియాకు కూడా భాగస్వామ్యం ఉందని నివేదిక పేర్కొంది. రెండు దేశాలకు చెందిన బృందాలు ఇప్పటికే షెడ్యూల్ చేయబడిన వివిధ దేశాల ఎన్నిలను డీప్‌ఫేక్‌లు, మీమ్స్, ఫొటోల మార్ఫింగ్ వంటి వాటి ద్వారా ఆటంకం కలిగించడానికి పూర్తి స్థాయిలో ప్రణాళికలు కలిగి ఉన్నాయని, అలాగే, ప్రపంచవ్యాప్తంగా, యూరోపియన్ యూనియన్‌తో పాటు కనీసం 64 దేశాలు జాతీయ ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నందున, వీటిల్లో కూడా ఎన్నికలను ప్రభావితం చేయడానికి చైనా బృందాలు సిద్ధంగా ఉన్నాయిని మైక్రోసాఫ్ట్ తెలిపింది. ఈ దేశాలు మొత్తం ప్రపంచ జనాభాలో దాదాపు 49 శాతం వాటా కలిగి ఉండటం గమనార్హం.
చైనా సృష్టించిన AI కంటెంట్ ప్రభావం ప్రస్తుతం తక్కువగా ఉన్నప్పటికీ, ఈ సాంకేతికత త్వరలో మరింత ప్రభావవంతంగా మారగలవని మైక్రోసాఫ్ట్ హెచ్చరించింది. ఇప్పటికే అమెరికాలో చైనా AI కంటెంట్ తన పనిని చేస్తుందని, కీలకమైన ఓటింగ్, ప్రచారంపై ఎఫెక్ట్ చూపించడానికి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల వేదికగా తన పనిని మొదలుపెట్టిందని నివేదిక పేర్కొంది. భారత్‌లో సాధారణ ఎన్నికలు ఏప్రిల్ 19న ప్రారంభం కానున్న నేపథ్యంలో తప్పుడు సమాచారాన్ని వెంటనే గుర్తించి దాని వ్యాప్తిని కట్టడి చేయాలని ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని మైక్రోసాఫ్ట్ భారత్‌ను హెచ్చరించింది.