Joe Biden : నేను మాట్లాడే వరకు సైలెంట్ గా ఉండండి

by Shamantha N |   ( Updated:2024-09-14 06:39:50.0  )
Joe Biden : నేను మాట్లాడే వరకు సైలెంట్ గా ఉండండి
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడు(US President) జో బైడెన్‌(Joe Biden) బ్రిటీష్ రిపోర్టర్‌పై విరుచుకుపడ్డారు. వైట్‌హౌస్‌లో బైడెన్‌, బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్‌మర్‌(UK Prime Minister Keir Starmer) కీలక సమావేశం నిర్వహించారు. ఈనేపథ్యంలో రష్యా- ఉక్రెయిన్‌కు యుద్ధంలో కీవ్ సుదూర క్షిపణలు వాడటంతో పాశ్చాత్య దేశాలకు మాస్కో నుంచి ఏర్పడే ముప్పు గురించి రిపోర్టర్ బైడెన్ ను ప్రశ్నించారు. " నేను మాట్లాడే వరకు మీరు సైలంట్ గా ఉండండి. నేను మీకు చెప్పేది అదే.?" అని ఫైర్ అయ్యారు. కాగా.. జర్నలిస్ట్ వినకుండా మళ్లీ అదే ప్రశ్న అడిగేసరికి.. బైడెన్ అసహనం వ్యక్తం చేశారు. "మీరు నిశ్శబ్దంగా ఉండాలి. నేను ఇక్కడ ఒక ప్రకటన చేయబోతున్నాను. మీరు మధ్యలో కలగజేసుకోకండి?" అని రిపోర్టర్ ని మందలించారు.

సుదూర క్షిపణులపై బైడెన్ ఏమన్నారంటే?

దీంతో సమావేశం ముగిసిన తర్వాత రిపోర్టర్ బైడెన్‌ను రష్యా యుద్ధం గురించి అడగగా ఆయన స్పందించారు. "వ్లాదిమిర్ పుతిన్ గురించి నేను పెద్దగా ఆలోచించను" అని చెప్పారు. ఉక్రెయిన్‌తో యుద్ధంలో పుతిన్‌ గెలిచే అవకాశం లేదని అన్నారు. రష్యాకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఉక్రెయిన్‌కు సహాయం చేసేందుకు అమెరికా కట్టుబడి ఉందన్నారు. అయితే ఉక్రెయిన్ సుదూర క్షిపణుల విషయంలో కొత్త విధానాన్ని ప్రకటించే ఆలోచన లేదని స్పష్టం చేశారు. 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా దాడిని ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు అమెరికా ఉక్రెయిన్‌కు 55.7 బిలియన్ డాలర్ల సహాయాన్ని అందించింది. ఈ వారం ప్రారంభంలో రష్యాపై దాడి చేసేందుకు సుదూర క్షిపణులను ఉపయోగించడంపై ఆంక్షలు ఎత్తివేస్తే.. నాటో సభ్యదేశాలతో యుద్ధం ఉంటుందని పుతిని హెచ్చరించారు. ఇటీవల ఉక్రెయిన్‌లోని కీవ్‌ను సందర్శించిన అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్.. వైట్ హౌజ్ వాటిపై ఆంక్షలు ఎత్తివేసే ఆలోచనలో ఉన్నట్లు హింట్ ఇచ్చారు. అయితే, ఉక్రెయిన్ సుదూర క్షిపణుల వినియోగంపై కొత్త విధానాన్ని ప్రకటించే ఆలోచన లేదని వైట్ హౌస్ ఈ ఊహాగానాలను కొట్టివేసింది.

Advertisement

Next Story