Aung San Suu Kyi: ఆంగ్ సాన్ సూకీ ఇల్లు వేలం

by M.Rajitha |   ( Updated:2024-08-15 15:11:33.0  )
Aung San Suu Kyi: ఆంగ్ సాన్ సూకీ ఇల్లు వేలం
X

దిశ, వెబ్ డెస్క్ : మయన్మార్ కీలక నేత, నోబెల్ బహుమతి గ్రహీత ఆంగ్ సాన్ సూకీ ఇంటిని వేలం వేసింది ఆర్మీ ప్రభుత్వం. కానీ విచిత్రంగా ఆ ఇంటిని కొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు. మయన్మార్ లోనే అతిపెద్ద నగరమైన యంగూన్ లో సరస్సు ఒడ్డున 1.9 ఎకరాల విస్తీర్ణంలో సూకీ ఇల్లు ఉంది. అయితే ఇది సూకీ ఇల్లు కాదు. స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని వీర మరణం చెందిన ఆమె తండ్రి పేరు మీద సూకీ తల్లికి అప్పటి ప్రభుత్వం ఈ రెండస్తుల భవనాన్ని కేటాయించింది. అందులోనే సూకీ 15 ఏళ్లపాటు గృహానిర్భందంలో ఉన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో గెలిచాక సూకీ నివాసాన్ని వదిలి రాజధాని నగరం నేపితాకు వెళ్లారు. ఆ తర్వాత 2015 ఎన్నికల్లో సూకీ పార్టీ భారీ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. కాని 2021 లో ఆంగ్ సాన్ సూకీ ప్రభుత్వాన్ని అక్కడి ఆర్మీ కూల్చివేసి ఆమెను మరోసారి నిర్భంధించింది. తర్వాత పలు కేసుల్లో ఆమెకు 27 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఆ పాత భవనం విషయంలో సూకీకి, ఆమె తమ్ముడికి గొడవలు ఉండగా.. ఆ ఇంటిని వేలం వేసి వచ్చిన సొమ్మును ఇరువురికి పంచాల్సి ఉంటుంది. ఆ భవనానికి 142 మిలియన్ల డాలర్ల ధరను వేలంలో ఉంచడం కూడా ఆ ఇంటిని ఎవరూ కొనేందుకు ముందుకు రాకపోవడం మరో కారణం. కాగా మరోసారి ఆ ఇంటిని వేలం వేసేందుకు ప్రభుత్వం సిద్దమవగా, సూకీ తరపున లాయర్ వేలాన్ని సవాలు చేస్తూ కోర్టులో కేసు వేశారు.

Advertisement

Next Story

Most Viewed