లండన్‌లో భారత సంతతి మహిళ హత్య.. బస్టాండ్‌లోనే పొడిచి చంపిన నిందితుడు

by samatah |
లండన్‌లో భారత సంతతి మహిళ హత్య.. బస్టాండ్‌లోనే పొడిచి చంపిన నిందితుడు
X

దిశ, నేషనల్ బ్యూరో: లండన్‌లో భారత సంతతికి చెందిన ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. బస్టాండ్‌లో వేచి ఉండగానే నిందితుడు కత్తితో పొడిచి చంపాడు. ఈ నెల 9వ తేదీన ఘటన జరగగా..తాజాగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకెళ్తే..నేషనల్ హెల్త్ సర్వీస్ లో మెడికల్ సెక్రటరీగా పార్ట్‌టైమ్‌గా పని చేస్తున్న అనితా ముఖే(66) గత గురువారం లండన్‌లోని ఎడ్గ్‌వేర్ ప్రాంతంలోని బర్న్ట్ ఓక్ బ్రాడ్‌వే బస్టాప్ వద్ద వేచి ఉంది. ఈ క్రమంలోనే 22ఏళ్ల జలాల్ డబెల్లా అనే యువకుడు ఆమెను కత్తితో దారుణంగా పొడిచాడు. దీంతో చాతీ, మెడపై తీవ్ర గాయాలు కావడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. అదే రోజు ఉత్తర లండన్‌లోని కొలిండేల్ ప్రాంతంలో హత్యకు పాల్పడినట్లు అనుమానంతో నిందితుడు డెబెల్లాను అరెస్టు చేశారు. విచారణలో భాగంగా నేరాన్ని అంగీకరించినట్టు పోలీసులు తెలిపారు. అయితే హత్యకు గల కారణాలను వెల్లడించలేదు. పగటి పూట హత్య జరగడంతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది.

Advertisement

Next Story