కూలీల ట్రాక్టర్ బోల్తా.. 20 మందికి గాయాలు

by Sumithra |
కూలీల ట్రాక్టర్ బోల్తా.. 20 మందికి గాయాలు
X

దిశ, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం నెల్లికుదురు మండలం బ్రాహ్మణపల్లి గ్రామ శివారులో కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో ట్రాక్టర్‌లో 30 మంది కూలీలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Next Story