సింగరేణిలో జాతీయ కార్మిక సంఘాల పోరుబాట..!

by Aamani |
సింగరేణిలో జాతీయ కార్మిక సంఘాల పోరుబాట..!
X

దిశ, ఆదిలాబాద్: సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటీకరించే కుట్ర జరుగుతున్నదని జాతీయ కార్మిక సంఘాలు ఆరోపించాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సింగరేణి అస్తిత్వాన్ని నిర్వీర్యం చేస్తున్నారని కార్మిక సంఘాల నేతలు ధ్వజమెత్తారు. ఈ మేరకు బుధవారం మంచిర్యాల జిల్లాలోని సింగరేణి జనరల్ మేనేజర్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. జాతీయ కార్మిక సంఘాలైన ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, బిఎంఎస్, హెచ్ఎంఎస్, సిఐటీయూ తదితర కార్మిక సంఘాలు ధర్నాలో పాల్గొన్నాయి. కార్మిక సంఘాలన్నీ జేఏసీగా ఏర్పడి ఆందోళనకు దిగాయి. సింగరేణిని ప్రైవేటీకరించడాన్ని అడ్డుకుంటామని జేఏసీ నేతలు చెప్పారు. అలాగే కార్మికులకు 12 గంటల పని రోజులను అమలు చేయాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. 12 గంటల పని రోజులతోపాటు, సింగరేణి ప్రైవేటీకరణ నిర్ణయాలను వెనక్కి తీసుకునేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని కార్మిక సంఘాల నేతలు స్పష్టం చేశారు. ఈ ధర్నాలో జేఏసీ నేతలు జనక్ ప్రసాద్, వాసిరెడ్డి సీతారామయ్య, రియాజ్ అహ్మద్ తో పాటు వివిధ సంఘాల నేతలు, కార్మికులు పాల్గొన్నారు.

Advertisement

Next Story