ప్రముఖ మహిళా రచయిత్రి కన్నుమూత

by Shamantha N |   ( Updated:2021-09-25 02:39:04.0  )
Kamla Bhasin
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ రచయిత్రి, మహిళా హక్కుల కార్యకర్త కమలా భాసిన్(75) కన్నుమూశారు. ఈ విషయాన్ని కొందరు ప్రముఖులు సోషల్ మీడియా వేదిక ద్వారా తెలిపారు. ‘‘ఈరోజు ఉదయం ఆమె తుదిశ్వాస విడిచారు. ఆమె మరణవార్త మమ్మల్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. కమలా భాసిన్ ఒక మహిళా హక్కుల కార్యకర్త మాత్రమే కాదు, అనేక ప్రజా ప్రయోజన సంస్థలను స్థాపించి సహాయం చేసిన గొప్ప వ్యక్తి. భాసిన్.. స్త్రీవాది మరియు రచయిత్రి. భారతదేశంలో, ఇతర దేశాలలో కూడా ఆమె మూడు దశాబ్ధాలుగా అభివృద్ధి, శాంతి, మానవ హక్కులతోపాటు ఇతర అంశాలపై ఆమె పని చేశారు. కవి, రచయిత్రిగా ఆమెకు మంచి గుర్తింపు ఉంది. పలు అంశాలపై భాసిన్ చాలా పుస్తకాలు రాశారు. స్త్రీవాదం, మహిళల సమస్యలపై పెద్ద సంఖ్యలో పుస్తకాలు రాశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి’’ అని పేర్కొంటూ సోషల్ మీడియా వేదికగా నివాళులర్పిస్తున్నారు.

Advertisement

Next Story