- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
చెరువులో పడి మహిళ మృతి
దిశ, నల్లగొండ: ప్రమాదవశాత్తు చెరువులో పడి ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటన మద్దిరాల మండల పరిధిలోని గోరెంట్ల గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం..గ్రామానికి చెందిన లింగంపల్లి లక్ష్మమ్మ (63) రోజూ మాదిరిగానే గ్రామంలోని మేడికుంట పక్కన గల తన వ్యవసాయ పొలానికిపని నిమిత్తం వెళ్లింది. ఎండాకాలం కావడంతో ఉదయం పూట తన గేదెలను మేపుతుండగా అవి చెరువులోకి వెళ్లాయి. వాటిని తోలుకురావడానికి వెళ్లిన లక్ష్మమ్మ ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అటుగా వెళ్లిన గ్రామస్తులు గమనించి మృతదేహాన్ని చెరువులో నుంచి బయటకు తీశారు.మృతురాలి కొడుకు సుధాకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నట్టు స్థానిక ఎస్‌ఐ సాయి ప్రశాంత్ తెలిపారు.
tags: woman dies, accidentally, fall in pond, nalgonda