బాలికల హాస్టల్లో యువకుల హల్‌చల్..

by srinivas |
బాలికల హాస్టల్లో యువకుల హల్‌చల్..
X

దిశ, వెబ్‌డెస్క్: కృష్ణాజిల్లాలోని బచ్చుపేట బాలికల హాస్టల్లో కొందరు యువకులు హల్‌చల్ చేశారు.తమ మిత్రుడు చనిపోయాడని, అతని జ్ఞాపకార్థం అమ్మాయిలకు ఆహారం పెట్టాలనుకుంటున్నామని వసతి గ‌ృహంలోకి ప్రవేశించారు.అనంతరం యువకులే స్వయంగా బిర్యానీ చేసి వడ్డించారు.ఆ సమయంలో బాలికలకు సెక్యూరిటీగా ఎవరూ లేరు. హాస్టల్ వార్డెన్ దీనిపై వివరణ కోరగా యువకులు వచ్చిన సమయంలో తాను లేనని, తిరిగి వచ్చేవరకు వారంతా వెళ్లిపోయారని తెలిపాడు. విషయం తెలుసుకున్న బాలికల తల్లిదండ్రులు, మహిళా, బీసీ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.వారికి ఎమైనా జరిగి ఉంటే ఎవరు బాధ్యత వహిస్తారని వార్డెన్ తీరుపై మండిపడ్డారు.విధుల్లో నిర్లక్ష్యం వహించేవారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను డిమాండ్ చేశారు.

Advertisement

Next Story