సిద్ధిపేటలో ఆమె ఎలా చనిపోయింది..?

by Sumithra |
సిద్ధిపేటలో ఆమె ఎలా చనిపోయింది..?
X

దిశ, సిద్ధిపేట: అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ మృతిచెందిన ఘటన సిద్ధిపేట జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సిద్ధిపేట జిల్లా అర్భన్ మండలం బూర్గుపల్లి గ్రామంలో కాలియా రామవ్వ (55) అనే మేకల కాపరి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.

బూర్గుపల్లి గ్రామంలో ఓ వ్యక్తి వ్యవసాయ పొలంలో అనుమానాస్పద స్థితిలో ఆమె మృతదేహం లభ్యమైంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story