గుర్తుపట్టలేని స్థితిలో మహిళా మృతదేహం

by Sridhar Babu |
గుర్తుపట్టలేని స్థితిలో మహిళా మృతదేహం
X

దిశ, కొత్తగూడెం: పాల్వంచ అడువుల్లో గుర్తుతెలియని మహిళా శవం లభ్యమైంది. బండ్రుకొండ నుంచి పూసుకోవడం వెళ్లే రహదారి సమీపంలోని అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతదేహాన్ని గమనిస్తే మెడ కోసి చంపి పెట్రోల్‌తో తగలపెట్టిన ఆనవాళ్లు స్పష్టంగా కనబడుతున్నాయి. బాధితురాలిని బైక్‌పై తీసుకువచ్చి దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక పశువుల కాపరి గమనించి పోలీసులకు సమాచారం అందించారు.

Advertisement

Next Story