HYDలో సంచలనం.. పార్టీల పేరుతో సెలబ్రిటీలకు ‘శిల్ప’ వల.. చిక్కిన ఆ తర్వాత..

by Anukaran |   ( Updated:2021-11-27 00:37:48.0  )
HYDలో సంచలనం.. పార్టీల పేరుతో సెలబ్రిటీలకు ‘శిల్ప’ వల.. చిక్కిన ఆ తర్వాత..
X

దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్ నగరంలో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. అధిక వడ్డీ ఇస్తానంటూ పలువురు ప్రముఖులను మోసం చేసిన కిలాడీ లేడీ వ్యవహారం బట్టబయలైంది. వివరాల ప్రకారం.. అధిక వడ్డీలు ఇస్తానంటూ శిల్ప అనే మహిళ పలువురు ప్రముఖుల వద్ద కోట్ల రూపాయలు డబ్బు వసూలు చేసింది. సినీ ప్రముఖులు, వ్యాపార వేత్తలు, ఫైనాన్షియర్స్ వద్ద శిల్ప డబ్బులు తీసుకొని మోసం చేసినట్టు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో పోలీసులు రంగంలోకి దిగారు.

విచారణ చేపట్టగా పేజ్ త్రీ పార్టీలతో సెలబ్రిటీలను శిల్ప ఆకర్షిస్తున్నట్టు తేలింది. దీంతో శిల్పతో పాటు ఆమె భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే శిల్ప బాధితుల్లో ముగ్గురు టాలీవుడ్ హీరోలు కూడా ఉన్నట్టు సమాచారం. ఇప్పటి వరకు శిల్ప రూ. 200 కోట్ల వరకు దండుకొని మోసం చేసినట్టు తెలుస్తోంది. శిల్ప అరెస్ట్ తెలుసుకున్న పలువురు నార్సింగి పోలీసు స్టేషన్‌కు క్యూ కడుతున్నారు.

Advertisement

Next Story