ప్రజల భాగస్వామ్యం లేకుంటే ఆగ్రహానికి గురికావాల్సిందే

by Shyam |
YS Sharmila Twitter
X

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రజలను భాగస్వామ్యం చేయకుండా చేసిన ఏ చట్టమైనా జనాగ్రహానికి గురికావాల్సిందేనని వైఎస్సార్​తెలంగాణ పార్టీ చీఫ్​షర్మిల శుక్రవారం ట్విట్టర్​వేదికగా పేర్కొన్నారు. రైతులను భాగస్వామ్యం చేయకుండా, రైతుల అనుమానాలు తొలగించకుండా, రైతులకు భరోసా కల్పించకుండా, రైతుల నెత్తిన రుద్దిన చీకటి చట్టాలను ఇప్పడికైనా రద్దు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు.

ఇది రైతులు సాధించిన గొప్ప విజయమని ఆమె వెల్లడించారు. ఇదిలా ఉండగా రాష్ట్ర ప్రభుత్వంపై షర్మిల విరుచుకుపడ్డారు. సీఎం సార్​కు లిక్కర్ అమ్మకాలపై ఉన్నంత శ్రద్ధ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడంలో లేదని చురకలంటించారు. బార్లకు టెండర్లు పిలవడంలో ఉన్న సోయి నోటిఫికేషన్లు భర్తీ చేయడంలో లేదని ఫైరయ్యారు. తెలంగాణలో ఇంకెంతమంది నిరుద్యోగులు బలికావాలని ప్రశ్నించారు. బంగారు తెలంగాణ అంటే నిరుద్యోగులను బలిపీఠం ఎక్కించడమేనా? జనాలను తాగుబోతులను చేయడమేనా అని విరుచుకుపడ్డారు.

Advertisement

Next Story