- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బెల్లంపల్లిలో రేషన్ బియ్యానికి రెక్కలు… లబ్దిదారులకు చుక్కలు…
దిశ, బెల్లంపల్లి : దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించని చందంగా బెల్లంపల్లి రేషన్ డీలర్ల తీరు పలు విమర్శలకు తావిస్తున్నది. అందుకు నిదర్శనంగా బెల్లంపల్లి పట్టణంలోని రేషన్ షాప్ డీలర్ నెంబర్ 25 ఎమ్. కళావతి రేషన్ షాప్ నకు వచ్చే ప్రజాపంపిణీ బియ్యాన్ని ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకుంటూ లబ్ధిదారులకు నిర్లక్ష్యపూరిత సమాధానాన్ని ఇవ్వడం నిత్యకృత్యమైందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బెల్లంపల్లి పట్టణంలోని హనుమాన్ బస్తీలో నివాసముండే బొల్లు రాజీరమ్మ(75) అనే వృద్ధురాలు తనకు వచ్చే రేషన్ బియ్యంతో జీవనం గడుపుతూ స్వశక్తితో పలువురి ఇళ్లల్లో కూలీ పనిచేస్తూ జీవనం సాగిస్తోంది.
ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన పది కేజీల బియ్యంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఐదు కేజీల బియ్యంను తీసుకునేందుకు బుధవారం రేషన్ షాప్ నెంబర్ 25 కళావతి డీలర్ దగ్గరకు వచ్చింది. సదరు వృద్ధురాలిని గంటల తరబడి షాపు దగ్గరే నిలబెట్టి నానా బూతులు తిడుతూ గెంటి వేయడం జరిగింది. ఇదే క్రమంలో బాధితురాలు ఎదుట వచ్చినవారికి బియ్యాన్ని పంపిణీ చేస్తూ రేషన్ షాప్ కు మంజూరైన సన్నబియ్యం అనుకూలమైన వ్యక్తులకు ఇస్తూ బియ్యాన్ని ఇవ్వానని బెదిరించడంతో ఆ వృద్ధురాలు కంటతడి పెట్టిన తీరు పలువురిని కలచివేసింది. లబ్దిదారులకు పంపిణీకి చేయాల్సిన బియ్యాన్ని డీలర్లు లాభార్జనతో పక్కదారి పట్టించే సంఘటనలు నిత్యం బెల్లంపల్లి పట్టణంలో చోటు చేసుకుంటున్నాయి.
ఈ విషయమై సంబంధిత డీలర్ కళావతి ని ప్రశ్నించగా అధికారులకు డీలర్లకు సఖ్యత ఉన్న దృష్ట్యా మీరు ఏమీ చేయలేరు అని నిర్లక్ష్య పూరితంగా సమాధానాన్ని ఇవ్వడంతో పాటు తమ ఇష్టానుసారం వ్యవహరిస్తామని చెప్పడం కొసమెరుపు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు దృష్టి సారించి స్టాక్ రిజిస్టర్ ను తనిఖీ చేయడంతో పాటు బియ్యాన్ని పంపిణీ చేసే విధి విధానాల పట్ల నిత్యం దృష్టి సారించి లబ్ధిదారులకు న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.