జనతా కర్ఫ్యూ ఎఫెక్ట్: స్తంభించనున్న ప్రజా రవాణా

by Shamantha N |
జనతా కర్ఫ్యూ ఎఫెక్ట్: స్తంభించనున్న ప్రజా రవాణా
X

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీ ఇచ్చిన ‘జనతా కర్ఫ్యూ’ పిలుపు మేరకు ఆదివారం దేశవ్యాప్తంగా రైళ్లు నిలిచిపోనున్నాయి. అయితే ఉదయం 7 గంటలకు ముందే ప్రయాణించే దూరప్రాంత రైళ్లు యథావిధిగా నడవనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్యాసింజర్ సంబంధించి 2400 సర్వీసులు, దూర ప్రాంతాలకు వెళ్లే 1400 రైళ్ల సర్వీసులు, 121 ఎంఎంటీస్ రైళ్ల సర్వీసులను నిలిపివేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. హైదరాబాద్‌లో మెట్రో సర్వీసులు కూడా నిలిచిపోనున్నాయి. ఇక ఆర్టీసీ బస్సుల విషయంలో స్పష్టత లేదు. ప్రస్తుతానికి తాము ఏ నిర్ణయం తీసుకోలేదని, ప్రభుత్వం నుంచి ఆదేశం వస్తే శనివారం నిర్ణయిస్తామని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు.

Tags: janatha curfew, trains, bus, metro service stop

Advertisement

Next Story

Most Viewed