- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కొడుకు, కోడలు విడాకులపై నాగార్జున క్లారిటీ..?
దిశ, వెబ్‌డెస్క్: అక్కినేని నాగ చైతన్య- సమంత తమ వివాహ బంధానికి స్వస్తి పలికారు. కొన్నిరోజుల నుంచి సోషల్ మీడియా లో వస్తున్న వార్తలను నిజం చేస్తూ తామిద్దరం విడిపోతున్నట్లు ప్రకటించారు. అయితే ఇంత పెద్ద విషయమై అక్కినేని ఫ్యామిలీ నోరు మెదపకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దగ్గరుండి నాగార్జున, చై- సామ్ ల వివాహాన్ని గ్రాండ్ గా జరిపించాడు. ఇక మామ- కోడళ్ల మధ్య కూడా బంధం బాగానే ఉందన్న విషయం అందరికి తెలిసిందే. ఇక ఈ విడాకుల విషయం బయటికి పొక్కిన దగ్గరనుంచి అక్కినేని ఫ్యామిలీ మౌనంగానే ఉంది.
నాగార్జున ఎన్నిసార్లు మీడియా ముందుకు వచ్చినా ఈ విషయం గురించి మాట్లాడింది లేదు. ఇక ఇన్నిరోజులుగా మిస్టరీగా ఉన్న ఈ విడాకుల కథ ముగింపుకు వచ్చింది. అయినా ఇప్పుడు కూడా నాగ్ మౌనం వహించడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొడుకు- కోడలు ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటున్నప్పుడు నాగ్ ఏమి సలహాలు, సూచనలు ఇవ్వలేదా..? సరే చై మంచి నిర్ణయం తీసుకుంటే కనీసం మీడియా ముందుకు వచ్చి తనకు మద్దతుగా మాట్లాడాలి కదా..? అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఇక ఇటీవల సామ్, నాగ్ బర్త్ డే కి మామ అని విష్ చేసినా ఆయన స్పందించకపోవడం, ఇప్పడూ కూడా నాగ్ మిన్నకుండిపోవడం చూస్తుంటే సామ్ పై నాగ్ కి కోపం ఉన్నట్లు ఉందని అభిమానులు అనుమానిస్తున్నారు. మరి ఇప్పుడైనా నాగ్ బయటికి వచ్చి ఈ విషయంపై స్పందించాలని, క్లారిటీ ఇవ్వాలని అభిమానులు కోరుతున్నారు.
- Tags
- Divorce