కార్మికుల ప్రాణాలకు ఖరీదు కడతారా ?

by Shyam |
safai workers
X

దిశ, సిటీ బ్యూరో: ఎల్బీనగర్ జోన్ లో డ్రైనేజీ నుంచి పూడిక తీస్తూ ప్రమాదవశాత్తు అందులో పడి మృతి చెందిన శివ, అంతయ్య అనే కార్మికుల ప్రాణాలకు రూ. 10 లక్షల ఖరీదు కడతారా? ఇది చాలా అవమానకరమని జాతీయ సఫాయి కర్మాచారి కమీషన్ సభ్యురాలు అంజనా పన్వర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గత నెల 3న ఈ ఘటన సాహెబ్ నగర్ ఘటన స్థలాన్ని ఆమె బుధవారం పరిశీలించారు. మృతుల కుటుంబాలను కలిసి పరామర్శించారు.జాతీయ సఫాయి కర్మచారి కమీషన్ సభ్యురాలు అంజనా పన్వర్ తో కలసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సైదాబాద్ లోని మృతుల కుటుంబాల ఇళ్లకు వెళ్లి ఒక్కొక్కరికీ మరో రెండు లక్షల రూపాయల చెక్కులను అందచేశారు. ఈ సందర్భంగా అంజనా పన్వర్ మాట్లాడుతూ అసలు దేశ వ్యాప్తంగా మ్యానువెల్ స్కావెంజింగ్ ను నిషేదించిన తర్వాత కూడా కార్మికులకు ఎలాంటి సేఫ్టీ మెజర్స్ లేకుండా లోనికి ఎలా దింపారని ప్రశ్నించారు. ఇలా దింపిన వారిపై తాను కూడా విచారణ చేపట్టి, వారికి కోర్టులో కఠిన శిక్షలు పడేలా సిఫార్సు చేస్తానన్నారు.

ఇద్దరు మున్సిపల్ కార్మికులు నాళాలో పడి మృతి చెందినట్లు తనకు ఆలస్యంగా తెలిసిందన్నారు. టెక్నాలజీ పెరిగిన తర్వాత కూడా ఇలాంటి ఘటనలు జరగటం చాలా బాధాకరమని అన్నారు. నిరు పేద కుటుంబాన్ని పోషించుకునేందుకు డ్రైనేజీ పనులు చేస్తూ జీవించే కార్మికుల ప్రాణాలకు రూ.10లక్షల విలువ కట్టడం అవమానకరమని,రూ.10లక్షల ఎక్స్ గ్రెషియా చెల్లింపుతో వారి కుటుంబానికి న్యాయం జరిగినట్లు ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఇందులో కాంట్రాక్టర్ ,జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈ ఘటన జరిగిందని ఆమె ఆగ్రహాం వ్యక్తం చేశారు. కార్పొరేషన్ అప్పగించిన పనులు చేస్తూ ఇద్దురు పేద కార్మికులు చనిపోతే కమిషనర్ కనీసం ఘటన స్థలానికి రాకపోవటం దారణమని వ్యాఖ్యానించారు. జాతీయ సఫాయి కర్మాచారి కమీషన్ సభ్యురాలు అంజనా పన్వర్ తో కలిసి మరో రూ. 2లక్షల చెక్కులను అందజేసిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి.

Advertisement

Next Story

Most Viewed