హోం గార్డునే చంపిన భార్య

by Sumithra |
హోం గార్డునే చంపిన భార్య
X

దిశ,నర్సంపేట :
సభ్య సమాజం తలదించుకునే పని చేసిందో భార్య. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడన్న నెపంతో కట్టుకున్న భర్తను కడ తేర్చిందో ఇల్లాలు. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నెక్కొండ మండలంలోని గేటుపల్లికి చెందిన దుర్యత్ సింగ్ (40) వరంగల్ లో ట్రాఫిక్ హోంగార్డుగా పనిచేస్తున్నాడు. నెక్కొండ పట్టణంలో కొన్ని నెలల నుంచి అతని భార్య జ్యోతి టైలరింగ్ షాపు నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే మండలంలోని అప్పల్ రావుపేటకు చెందిన జిల్లా రాజుతో ఆమెకు పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారీతీసింది. ఈ విషయం భర్త దుర్యత్ సింగ్ కు తెలిసింది. ఈ క్రమంలో ఎలాగైన భర్త అడ్డు తొలగించాలని ప్రియుడు రాజుతో కలిసి భర్త హత్యకు ఆమె ప్లాన్ చేసింది. అనుకున్నట్టుగానే ఇరువురు కలిసి దుర్యత్ సింగ్‌ను హత్య చేశారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. కాగా న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్ ఎదుట బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు.

Advertisement

Next Story