ఆమెకు లవరున్నాడని ఒప్పుకుంది.. ఫర్వాలేదు గతాన్ని మరిచిపొమ్మని భర్త సలహా ఇచ్చాడు.. ఆ తర్వాత జరిగింది ఇదే!

by Sumithra |   ( Updated:2021-12-01 03:06:49.0  )
affair1
X

దిశ, వెబ్ డెస్క్: గత కొద్దిరోజుల నుంచి ఆత్మహత్యలు, హత్యా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం వివాహేతర సంబంధాలే అని తేలుతుంది. తమ సుఖం కోసం కుటుంబ సభ్యులను, బంధువులను బలి చేస్తున్నారు. అది తప్పు.. మానుకోమని సలహా ఇస్తే తమ వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నారని చంపేస్తున్నారు. ఇలాంటి ఘటనే హర్యానాలో చోటు చేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని తన భర్తను కడతేర్చింది ఓ కసాయి భార్య. దీంతో ఆమెను, ఆమె ప్రియుడిని, వారికి సహకరించిన మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.

వివరాల్లోకి వెళితే.. హర్యానాలోని కర్నల్ జిల్లా అంబాల ప్రాంతానికి చెందిన రవీంద్ర కౌర్(34)-సన్నీ భార్యాభర్తలు. ఐదేళ్ల క్రితం వీరికి పెళ్లి అయ్యింది. వీరికి ఓ కూతురు కూడా పుట్టింది. అయితే, సన్నీ తన భర్త రవీంద్రకు ఓ షాకింగ్ విషయాన్ని చెప్పింది. తనకు స్కూల్ లో చదువుతున్నప్పట్నుంచి తనకు ఓ లవరుడున్నాడని.. అతడిని పెళ్లి చేసుకునేందుకు తల్లిదండ్రులు ఒప్పుకోలేదని.. ఈ నేపథ్యంలోనే నీకు(రవీంద్ర) ఇచ్చి పెళ్లి చేశారని తెలిపింది. ఇది విన్న రవీంద్ర.. తన భార్యకు ఓ సలహా ఇచ్చాడు. పర్వాలేదు.. గతాన్ని మరిచిపోయి హ్యాపీగా ముందుకెళ్దామని చెప్పాడు. అయినా మారని సన్నీ తన ప్రియుడితో రోజూ ఫోన్ లో మాట్లాడుతూ ఉండేది. ఇది గమనించిన రవీంద్ర ఆమెను నిలదీశాడు. ఈ నేపథ్యంలో వారిద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. దీంతో అతడిని ఎలాగైనా అడ్డుతొలగించాలని పథకం పన్నింది. ఇది తన ప్రియుడికి చెప్పింది. అందుకు తన ప్రియుడు కూడా ఓకే చెప్పాడు. అనుకున్న విధంగా తన భర్తను ప్రియుడు పొలాల్లోకి తీసుకెళ్లి హత్య చేశాడు. విషయం పోలీసులకు తెలవడంతో కేసు నమోదు చేసి విచారణ జరిపి సన్నీని, ఆమె ప్రియుడిని, వారికి సహకరించిన మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు.

విడాకుల తర్వాత సమంతను వెనకుండి నడిపిస్తున్న తల్లి

Advertisement

Next Story