కరోనాతో భర్త మృతి.. భార్య ఆత్మహత్య

by Shyam |
కరోనాతో భర్త మృతి.. భార్య ఆత్మహత్య
X

దిశ, క్రైమ్ బ్యూరో: కరోనాతో భర్త మరణించడంతో మనస్తాపానికి గురైన భార్య ఆత్మహత్య చేసుకుంది.
ఈ సంఘటన అమీర్ పేట ఎల్లారెడ్డిగూడ లో చోటు చేసుకుంది. పంజాగుట్ట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్లారెడ్డిగూడలో నివసించే విజయ్ కుమార్, నర్మద దంపతులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఈ పరిస్థితుల్లో వారి ఇంటి ఫస్ట్ ఫ్లోర్‌లోనే క్వారంటైన్‌లో ఉంటున్నారు.

అయితే, వైరస్ తీవ్రతతో భర్త విజయ్ కుమార్ ఈ నెల 5వ తేదీన మరణించాడు. భర్త మరణాన్ని నర్మద తట్టుకోలేకపోయింది. ఇక తన తండ్రికి మరణం తర్వాత కుమారుడు పవన్ కూడా క్వారంటైన్‌లోనే ఉంటున్నాడు. ఈ నేపథ్యంలోనే నర్మద శుక్రవారం తిరిగి కరోనా పరీక్షలు చేయించుకొని ఇంటికి చేరుకుంది. ఫస్ట్ ఫ్లోర్‌కి వెళ్లకుండా నేరుగా గ్రౌండ్‌ఫ్లోర్‌లోని రూమ్ కి వెళ్లింది. ఆ తర్వాత ఫ్యాన్‌కు బెడ్ షీట్ తో ఉరి వేసుకుంది. అయితే, కిందకి వచ్చి చూసిన పవన్ తల్లి విగత జీవిగా కనిపించడంతో కన్నీరు మున్నీరయ్యాడు.

Advertisement

Next Story