క్రికెట్‌కు పార్థివ్ పటేల్ గుడ్ బై

by Anukaran |   ( Updated:2020-12-09 01:23:07.0  )
క్రికెట్‌కు పార్థివ్ పటేల్ గుడ్ బై
X

దిశ, వెబ్‌డెస్క్ : భారత క్రికెట్ జట్టు వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ బుధవారం రిటైర్ మెంట్ ప్రకటించాడు. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు. 17ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్ లో అరంగేట్రం చేసిన పార్థివ్ .. అతి చిన్న వయస్సులో వికెట్ కీపర్ గా చరిత్ర సృష్టించాడు.

అతని కెరీర్‌లో 25టెస్టులు, 38వన్డేలు, రెండు టీ20లు ఆడాడు. గుజరాత్ తరఫున 194 ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడిన పటేల్.. 2017లో సారథిగా గుజరాత్ టీంకు రంజీ ట్రోఫీ అందించాడు.ప్రస్తుతం ఇండియన్ టీంలో ప్లేస్ లభించకపోవడంతో రిటైర్మెంట్ ప్రకటించినట్లు ఆయన పేర్కొన్నారు.

Advertisement

Next Story