సామాన్యుల చేతిలో వాతావరణ సమాచారం

by Shyam |
సామాన్యుల చేతిలో వాతావరణ సమాచారం
X

దిశ, న్యూస్ బ్యూరో: తెలంగాణలోని సామాన్యులకు ఇక మీదట వాతావరణ సమాచారం, వర్ష సూచనకు సంబంధించి వివరాలు తెలియనున్నాయి. అందుకోసం సమగ్ర వివరాలతో కూడిన వెదర్ మొబైల్‌ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు. శుక్రవారం హైదరాబాద్ బంజారాహిల్స్ లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో టీఎస్- వెదర్ (ts-weather) మొబైల్ యాప్, పోస్టర్స్‌ను ఆయన ఆవిష్కరించారు. తెలంగాణ స్టేట్ డెవలప్ మెంట్ ప్లానింగ్ సొసైటీ (టీఎస్ డీపీఎస్) ఈ యాప్‌ను రూపొందించింది. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ..రైతులు, ప్రజలకు ఈ యాప్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. వాతావరణ పరిస్థితులు, సూచనలతో రైతులు వ్యవసాయ పనులు, ప్రజలు తమ ప్రయాణాలను సాఫీగా కొనసాగించుకునేందుకు వీలు కలుగుతుందని చెప్పుకొచ్చారు.రాష్ట్రంలోని ఏ ప్రాంతం వివరాలైనా క్షణాల్లో అందించే విధంగా ఈ యాప్‌ను తీర్చిదిద్దినట్లు ఆయన తెలిపారు. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ ఈ యాప్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వినోద్ కుమార్ వివరించారు.

Advertisement

Next Story

Most Viewed