- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
BJP: రేవంత్ సర్కార్ మెడలు వంచిన బీజేపీ.. బీజేపీ తెలంగాణ ఆసక్తికర ట్వీట్
దిశ, వెబ్ డెస్క్: ఫార్మాసిటీ(Pharma City)పై బీజేపీ(BJP) రేవంత్ సర్కార్(Revanth Governance) మెడలు వంచిందని బీజేపీ తెలంగాణ(BJP Tealangana) ట్వీట్ చేసింది. కొడంగల్(Kodangal) లో ఫార్మా సిటీ రద్దు, బీజేపీ పోరాటంతో దిగొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) అంటూ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(G.Kishan Reddy), ఎంపీలు ఈటల రాజేందర్(Eatala Rajender), డీకే అరుణ(DK Aruna) ఫోటోలను పోస్ట్ చేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. దీనిపై ఫార్మా సిటీ పై కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తగ్గిందని చెప్పింది. రేవంత్ ప్రభుత్వం తమ బలాన్నంతా ప్రయోగించి బీజేపీ నాయకులను(BJP Leaders) ఆపాలని విశ్వప్రయత్నాలు చేసినా ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా.. రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి నేతృత్వంలో మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ, మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ అనేకమార్లు లగచర్ల పర్యటనలు, జైలులో ఉన్న బాధితులకు మద్దతుగా అలుపెరగని పోరాటం చేశారని తెలిపింది. అంతేగాక ఈ ఘటనపై మానవ హక్కుల సంఘం, ఎస్సీ- ఎస్టీ కమిషన్లకు ఫిర్యాదులు చేశారని వివరించింది. ఇక లగచర్ల ఘటన బాధితుల న్యాయ పోరాటంలో బీజేపీ మద్దతునిచ్చి రేవంత్ సర్కార్ మెడలు వంచిందని ఎక్స్ లో రాసుకొచ్చింది.