- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆసిఫాబాద్‌లో హై టెన్షన్.. BRS MLA కోవ లక్ష్మి హౌస్ అరెస్ట్
దిశ, ఆసిఫాబాద్: వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థిని శైలజ మృతితో ఆసిఫాబాద్ హైటెన్షన్ మొదలైంది. శైలజ మృతదేహాన్ని హైదరాబాద్ నిమ్స్ నుంచి నేరుగా స్వగ్రామం అయిన వాంకిడి మండలంలోని దాబా గ్రామానికి భారీ పోలీస్ భద్రత మధ్య తరలించారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి శైలజ కుటుంబాన్ని పరామర్శించేందుకు కార్యకర్తలతో వెళ్తుండగా పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. దీంతో బీఆర్ఎస్ కార్యకర్తలు.. పోలీసుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.
దీంతో ఇంట్లోనే బైటాయించి ఎమ్మెల్యే లక్ష్మి నిరసన తెలిపారు. పోలీసులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న తనను అరెస్ట్ చేయడం దారుణమన్నారు. శైలజ మృతి ప్రభుత్వ హత్య అని అన్నారు. మృతి చెందిన విద్యార్థిని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. శైలజ మృతదేహంతో ఆశ్రమ పాఠశాల ఎదుట ఆందోళన చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో మాలీ సంక్షేమ సంఘంలో పలువురు ముఖ్య నాయకులను వాంకిడి పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ఎలాంటి అల్లర్లు జరుగకుండా ఆశ్రమ పాఠశాల, సావాతి, మర్కగూడ చౌరస్తా వద్ద భారీ పోలీసులను మోహరించారు.