- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Cancer: ఈ పార్ట్‌లో దురద వస్తుందా..? క్యాన్సర్‌కు సంకేతమే..!
దిశ, వెబ్‌డెస్క్: ‘సాధారణంగా మన శరీరంలో కణ విభజనలు ఒక క్రమ పద్ధతిలో నియంత్రించబడతాయి. కొన్ని సందర్భాలలో కణాల పెరుగుదలలో నియంత్రణ లేనట్లైతే.. కణాలు చాలా వేగంగా అస్తవ్యస్తంగా విభజన చెంది కణ సమూహాలను ఏర్పరుస్తాయి. ఈ కణసమూహాలను 'కంతి' ( టూమర్, tumor) అంటారు. అటువంటి కొన్ని ప్రమాదకరమైన వాటిని క్యాన్సర్(Cancer)గా అని వ్యవహరిస్తారు’.
అయితే ప్రస్తుత రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా గొంతు క్యాన్సర్ అని, నోటి క్యాన్సర్, కాలేయ క్యాన్సర్, కంటి క్యాన్సర్.. ఇలా చెబుతూ వెళ్తే శరీరంలోని అన్ని పార్ట్స్ కు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. అయితే క్యాన్సర్ లక్షణాల్లో దురద రావడం కూడా ఓ లక్షణంగా పరిగణించబడుతుందట. చాలా మంది దురద లేస్తున్న లైట్ తీసుకుంటారు. కానీ చంకల్లో(armpits) దురద పెట్టడం కూడా క్యాన్సర్‌కు కారణమేనంటున్నారు నిపుణులు.
దీన్ని లింఫోమా క్యాన్సర్(Lymphoma is cancer) అంటారు. ఈ క్యాన్సర్ సోకిన వారిలో 30 శాతం మందికి దురదగా అనిపిస్తుంది. ఈ వ్యాధి వచ్చినప్పుడు శరీరంపై దద్దుర్లు కనిపియ్యవు. దురద వస్తే కూడా గోకడం వల్ల ఉపశమనం కలుగదు. దీర్ఘకాలికంగా అక్కడ మంట, దురద రావడం వంటివి క్యాన్సర్ సంకేతాలేనంటున్నారు నిపుణులు.
చంకలో ఈ క్యాన్సర్ సోకితే మాత్రం.. ఆ ప్రాంతంలో ఫలకాలు ఏర్పడి.. పొలుసుల్లా వచ్చి రాలిపోతాయి. లోపల భాగంలో ఏర్పడకుండా చిన్న గడ్డలు పుడతాయి. అలాగే చంకలో దురద వస్తే రొమ్ము క్యాన్సర్(Breast cancer)కు కూడా దారితీయొచ్చు అంటున్నారు నిపుణులు.
రొమ్ముల్లో దురద, మృదువుగా ఎర్రగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తే మాత్రం క్యాన్సర్ లక్షణంగా భావించాల్సి ఉంటుంది. పది రోజుల్లో ఈ లక్షణాలు ఇలాగే కనిపిస్తే మాత్రం డాక్టర్‌ను సంప్రదించాలి. మామోగ్రామ్(Mammogram), బ్రెస్ట్ అల్ట్రా సౌండ్(Breast ultrasound) వంటి టెస్ట్స్ చేయించుకోవాలి.