CM Revanth Reddy : అందరికి రాజ్యాంగ ఫలాలు..అదే ప్రజా ప్రభుత్వ సంకల్పం : సీఎం రేవంత్ రెడ్డి

by Y. Venkata Narasimha Reddy |
CM Revanth Reddy : అందరికి రాజ్యాంగ ఫలాలు..అదే ప్రజా ప్రభుత్వ సంకల్పం : సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్ : భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్(BR Ambedkar)మార్గనిర్ధేశనంలో అందించిన రాజ్యాంగ ఫలాలు(Constitutional Benefits)ప్రజలందరికీ అందాలనేదే ప్రజా ప్రభుత్వ సంకల్పమని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)స్పష్టం చేశారు. దేశ పౌరులకు న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలను అందిస్తూ రాజ్యాంగాన్ని ఆమోదించి నేటికి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా ప్రజలందరికీ “భారత రాజ్యాంగ దినోత్సవ”(Indian Constitution Day) శుభాకాంక్షలను సీఎం తెలియజేశారు.

1949 నవంబర్ 26 న రాజ్యాంగాన్ని ఆమోదిస్తూ తీసుకున్న నిర్ణయంతో భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశంగా పరిఢవిల్లుతోందని అన్నారు. దేశాన్ని సమున్నతంగా నిలబెట్టిన రాజ్యాంగ నిర్మాతలను సంవిధాన్ దివస్ రోజున స్మరించుకోవడమే కాకుండా రాజ్యాంగ విలువలు కాపాడుతూ ఆ మహాశయుల ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ నిరంతరం పనిచేయాలని సీఎం ఆకాంక్షించారు. ప్రతినిత్యం మన హక్కులు, బాధ్యతలను గుర్తుచేస్తూ అందరికీ సమానావకాశాలతో ప్రగతిపథంలో బాటలు వేయడానికి నిత్యస్ఫూర్తిగా నిలిచే మూలస్తంభం మన రాజ్యాంగం అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed