Oily Skin: ఆయిల్ స్కిన్ వాళ్లకి మాశ్చరైజర్ మంచిదా..?

by Kanadam.Hamsa lekha |   ( Updated:2024-11-26 06:17:02.0  )
Oily Skin: ఆయిల్ స్కిన్ వాళ్లకి మాశ్చరైజర్ మంచిదా..?
X

దిశ, ఫీచర్స్: పొడిబారిన చర్మానికి తప్పనిసరిగా మాశ్చరైజర్ అవసరం ఉంటుంది. కానీ, చాలామంది ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్లకి మాత్రం మాశ్చరైజర్ వాడాలా? లేదా అనే సందేహం ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ మాశ్చరైజర్ రాస్తే చర్మం కాంతిని కోల్పోయి మరింత జిడ్డుగా కనిపింస్తుందోమోనని అనుకుంటారు. ఇది కేవలం అపోహ మాత్రమే. నిజానికి అన్నీ రకాల చర్మం వారికి మాశ్చరైజర్ అవసరం అవుతుంది. చర్మం శుభ్రం చేసుకున్న తరువాత మాశ్చరైజర్, టోనర్ తప్పనిసరిగా వాడాలి. ఇది స్కిన్‌ని హైడ్రేషన్‌గా ఉంచుతుంది. కానీ, ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్లు మాత్రం కొన్ని ఉత్పత్తులకు దూరంగా ఉండాలి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.

పొడి చర్మం వారికి తప్పపనిసరిగా మాశ్చరపైజర్ అవసరం ఉంటుంది. ఇది చర్మం బయటిపొరను తేమగా ఉంచడంలో సహాయపడతాయి. ముడతలు, చర్మంపై ఏర్పడిన గీతలను తొలగించి, స్కిన్‌ను తేమగా ఉంచుతుంది. అయితే, ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్లు మాత్రం సోడియం లారెట్ సల్ఫేట్, ఆల్కలీన్ సర్ఫ్యెక్టెంట్‌లు ఉన్న ఉత్పత్తులకు దూరంగా ఉండాలి. ఇవి చర్మం పైభాగంలోని రంధ్రాలను మూసివేస్తాయి. దీని కారణంగా ఇతర చర్మ సమస్యలు వస్తాయి. నాన్-కామెడోజెనిస్ మాశ్చరైజర్‌ని ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్లు ఉపయోగించడం మంచిది.

ఇది చర్మంపై ఉన్న రంధ్రాలను మూసుకుపోకుండా చేస్తుంది. బ్లాక్‌‌‌‌‌‌‌‌హెడ్స్ వచ్చే ప్రమాదాన్ని తగ్గించడంలో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా.. నీటి ఆధారిత మాశ్చరైజర్‌ను ఎంచుకోవడం వల్ల చర్మం జిడ్డుగా మార్చదు. ఆయిల్ ఫ్రీ మాశ్చరైజర్, చర్మంపై మొటిమలు రాకుండా చేస్తుంది. జిడ్డు చర్మంతో బాధపడేవారు విటమిన్ సి సీరమ్‌ను కూడా ఉపయోగించవచ్చు. దీనిని క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది.

*గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed