- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
KTR: నేను సైకో అయితే.. నువ్వు శాడిస్ట్‌వా..! రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ సెన్సేషనల్ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: సీఎం అయ్యాక కూడా తమ మీద రేవంత్‌రెడ్డి (Revanth Reddy)కి ఫ్రస్ట్రేషన్ ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) ఫైర్ అయ్యారు. ఇవాళ హైదరాబాద్ (Hyderabad)లోని తెలంగాణ భవన్ (Telangana Bhavan)లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం (CM) ఏం మాట్లాడుతున్నారో కూడా ఆయనకు అర్థం కావడం లేదని ఆరోపించారు. జాతీయ ప్రాజెక్టులు (National Projects) కూడా అదానీ (Adani)కి బీఆర్ఎస్ (BRS) ఇచ్చిందని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. జాతీయ ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడైనా టెండర్లు పిలుస్తుందా.. అని ప్రశ్నించారు.
ఏది పడితే అది మాట్లాడితే భగవద్గీత శ్లోకాలు అయిపోవని ఆయన సిరీయస్ అయ్యారు. కోపం, బాధతో నిన్నటి ప్రెస్‌మీట్‌లో సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) మాట్లాడారని గుర్తు చేశారు. అదానీ (Adani)ని తాము ఎంకరేజ్ చేయలేదని, తాము రెడ్ సిగ్నల్ (Red Signal) చూపిస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం రెడ్ కార్పెట్ (Red Carpet) వేసిందని మండిపడ్డారు. పదేపదే తనను రేవంత్‌రెడ్డి (Revanth Reddy) తనను సైకో అని సంబోధిస్తున్నారని.. తాను సైకో అయితే.. రేవంత్ శాడిస్టా అని గరం అయ్యారు. అధికారంలో ఉన్న నాడు కూడా తాము అదానీ (Adani)తో బహిరంగంగానే కలిశామని.. వారి లాగా రహస్యంగా ములాఖత్ కాలేదని కేటీఆర్ అన్నారు.