Yadadri: ఆర్టీసీ బస్సులో ఓ ప్రయాణికుడు గుండె పోటుతో మృతి

by Ramesh Goud |
Yadadri: ఆర్టీసీ బస్సులో ఓ ప్రయాణికుడు గుండె పోటుతో మృతి
X

దిశ, వెబ్ డెస్క్: ఆర్టీసీ(TGSRTC) బస్సులో వెళ్తున్న ఓ ప్రయాణికుడు గుండె పోటు(Heart Attack)తో మృతి(Died) చెందిన ఘటన పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్(Pocharam IT Corridor Police Station) పరిధిలో జరిగింది. యాదాద్రి(Yadadri) నుంచి హైదరాబాద్(HYD) వస్తున్న ఆర్టీసీ బస్సులో ఇవాళ ఓ ప్రయాణికుడు అకస్మాత్తుగా స్పృహ తప్పి పడిపోయాడు. అప్రమత్తమైన కండక్టర్ సహా తోటి ప్రయాణికులు గుండె పోటుకు గురయ్యాడని గుర్తించి, సీపీఆర్ చేయడం ప్రారంభించారు. అయినా సరే ఆ వ్యక్తి ఊపిరి తీసుకోవడం కష్టంగా మారి ప్రాణాలు విడిచాడు. దీనిపై సమాచారం అందుకున్న పోచారం ఐటీ కారిడార్ పోలీసులు.. చనిపోయిన వ్యక్తిని యాదాద్రి జిల్లా భువనగిరి పట్టణానికి చెందిన గీతాకార్మికుడు డొంకెని పాండు(59)గా గుర్తించారు. అనంతరం చనిపోయిన వ్యక్తి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.

Advertisement

Next Story

Most Viewed