- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
త్వరలోనే వాట్సాప్‌లో మరిన్ని ఫీచర్లు
దిశ, వెబ్ డెస్క్ :
ప్రముఖ మెసేజింగ్ యాప్ ‘వాట్సాప్’ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అందిస్తూ తన యూజర్లను ఆకట్టుకుంటోంది. ఇప్పటికే డార్క్ మోడ్‌ను అందించిన వాట్సాప్, వీడియో కాల్ పరిమితిని కూడా పెంచేసింది. ఇక ముందు కూడా మరెన్నో ఫీచర్లను యూజర్లకు అందుబాటులోకి తెచ్చేందుకు వాట్సాప్ సిద్ధమవుతోంది. అందులో భాగంగానే ‘మల్టీ లాగిన్ డివైజ్’ సపోర్ట్ ఫీచర్‌తో పాటు, వాట్సాప్ క్యూ ఆర్ కోడ్, ఇన్ యాప్ బ్రౌజర్, సెర్చ్ బై డేట్, క్లియర్ చాట్ ఫీచర్లు ఉండనున్నాయి.
ప్రస్తుతానికి వాట్సాప్ అకౌంట్‌ను ఒకే మొబైల్‌లోనే యూజ్ చేస్తున్నాం. అయితే ప్రస్తుత కాలంలో చాలా మంది రెండు మొబైల్స్ యూజ్ చేస్తున్నారు. మరి ఒకేసారి రెండు ఫోన్లలోనూ.. ఒకే అకౌంట్‌తో లాగిన్ అయితే? ప్రస్తుతానికైతే ఇది సాధ్యపడదు. కానీ త్వరలోనే యూజర్లు ఆ సౌకర్యాన్ని పొందే అవకాశాలున్నాయి. వాట్సాప్ అందుకోసం ‘మల్టీపుల్ లాగిన్ డివైజ్ సపోర్ట్’ ఫీచర్‌ను వీలైనంత త్వరగా యూజర్లకు అందించడానికి ప్రయత్నాలు చేస్తోందని ‘డబ్ల్యూఏ బేటాఇన్ఫో’ వెల్లడించింది. దీనివల్ల ఒకేసారి పలు డివైజ్‌లలో లాగిన్ అయ్యే అవకాశం ఉండటంతో పాటు ల్యాప్, డెస్క్ టాప్‌ల నుంచి లాగవుట్ చేయాల్సిన అవసరం ఉండదు. అంతేకాకుండా పలు డివైజ్‌ల నుంచి ఒకే సమయంలో చాట్ చేసే అవకాశం ఉంది. దీంతో పాటు వాట్సాప్‌ను డెస్క్‌టాప్ లేదా ల్యాప్‌టాప్‌లో వాడాలంటే.. తప్పనిసరిగా మొబైల్ ఉండాలి. అయితే ఇక ముందు మొబైల్ లేకపోయినా.. వాట్సాప్ వెబ్ వాడేలా ఫీచర్స్ తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది.
‘సెర్చ్ బై డేట్’ ఆప్షన్..
వాట్సాప్‌లో కాంటాక్ట్స్ పెరుగుతున్న కొద్దీ, గ్రూపులు కూడా పెరుగుతాయి. అలాంటప్పుడు పర్టిక్యులర్‌గా పాత ఇమేజ్ కావాలన్నా, ఏదైనా ఇంపార్టెంట్ మెసెజ్ వెతకాలన్నా చాలా కష్టం అవుతోంది. అలాంటప్పుడు వాటిని ఈజీగా సెర్చ్ చేయడానికి ‘సెర్చ్ బై డేట్ ’ ఉపయోగపడుతుంది. వాట్సాప్‌లో స్టేటస్ పెట్టిన 24గంటల్లో అది మాయమవుతుంది. అలానే.. యూజర్ సెండ్ చేసిన మెసేజ్ కూడా అవతలి యూజర్ చూసిన తర్వాత ఆటోమేటిక్‌గా డిలీట్ అయ్యేలా ఓ ఆప్షన్‌ను వాట్సాప్ తీసుకురాబోతుంది. ఆ మెసేజ్ ఎంత టైమ్ వరకు ఉండాలన్నది యూజర్ ఇష్టం. ఇవే కాకుండా మరిన్ని న్యూ ఫీచర్ల కోసం వాట్సాప్ కసరత్తులు చేస్తున్నట్లు టెక్ నిపుణులు చెబుతున్నారు.