అందుబాటులోకి వాట్సాప్ డార్క్ మోడ్

by Harish |
అందుబాటులోకి వాట్సాప్ డార్క్ మోడ్
X

దిశ, వెబ్‌డెస్క్:
ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్న వాట్సాప్ డార్క్ మోడ్ ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చేసింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఈ డార్క్ మోడ్‌ని వినియోగించుకోవచ్చు. అందుకోసం ముందుగా ప్లేస్టోర్, యాప్‌ స్టోర్ ద్వారా యాప్‌ని అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఈ డార్క్ మోడ్‌లో వాట్సాప్ ముదురు గ్రే రంగు బ్యాగ్రౌండ్‌లో తెలుపు అక్షరాలను చూపిస్తుంది. పూర్తిగా నలుపు రంగు మీద తెలుపు రంగు అక్షరాలు ఉంటే కళ్లకు ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో గ్రే రంగును ఎంచుకున్నట్లు వాట్సాప్ తెలిపింది. ఈ డార్క్ మోడ్‌లో స్క్రీన్ బ్రైట్‌నెస్ తగ్గి, కళ్ల మీద గ్లేర్ తగ్గించి, కాంట్రాస్ట్, రీడబిలిటీ పెంచుతుందని వెల్లడించింది.

ఎలా ఆన్ చేసుకోవాలి?

ముందు ప్లేస్టోర్ లేదా యాప్‌స్టోర్‌కి వెళ్లి వాట్సాప్ యాప్‌ని అప్‌డేట్ చేసుకోవాలి. తర్వాత యాప్ ఓపెన్ చేసి సెట్టింగ్స్‌లో చాట్స్ ఆప్షన్‌కి వెళ్లాలి. అందులో థీమ్‌లో డార్క్ అనే ఆప్షన్‌ని ఎంచుకోవాలి. ఆండ్రాయిడ్ 10, ఐఓఎస్ 13 వారు అయితే డార్క్ మోడ్‌ని సిస్టమ్ డీఫాల్ట్‌గా కూడా ఎంచుకోవచ్చు. గత రెండేళ్లుగా ఊరిస్తున్న ఈ డార్క్ మోడ్ అందుబాటులోకి రావడంతో వినియోగదారులు ఆనంద పడుతున్నారు.

Tags: Whatsapp, Whatsapp web, Whatsapp dark mode, dark mode, Apple, IoS, Android, Settings, Update

Advertisement

Next Story

Most Viewed