ఎస్సీ వర్గీకరణ పై జగన్ వైఖరేంటో స్పష్టం చేయాలి: మందకృష్ణ మాదిగ

by Jakkula Mamatha |
ఎస్సీ వర్గీకరణ పై జగన్ వైఖరేంటో స్పష్టం చేయాలి: మందకృష్ణ మాదిగ
X

దిశ,వెబ్‌డెస్క్: ఎస్సీ వర్గీకరణపై ఏపీ(Andhra Pradesh) శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చారిత్రక విజయమని MRPS వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ(Mandakrishna Madiga) పేర్కొన్నారు. ఏపీ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లును గురువారం ప్రవేశ పెట్టగా.. ఈ బిల్లుకు సభ్యులందరూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఎస్సీ వర్గీకరణ పోరాటానికి ఏపీ సీఎం చంద్రబాబు మొదటి నుంచి అండగా ఉన్నారని మందకృష్ణ మాదిగ తెలిపారు. మా ఉద్యమంలో న్యాయం ఉందనేందుకు ఏకగ్రీవ తీర్మానాలే నిదర్శనమన్నారు. ఎస్సీ వర్గీకరణకు కార్యకర్తలు ఎంతో పోరాటం చేశారని గుర్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణ విషయంలో చంద్రబాబు(CM Chandrababu), జగన్(YS Jagan) మధ్య చాలా తేడా ఉందని అన్నారు.

మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటే ఎస్సీ వర్గీకరణను ఇక చూసేవాళ్లం కాదని మందకృష్ణ అన్నారు. కనీసం వినతిపత్రం ఇచ్చేందుకు వైఎస్ జగన్ మాకు అనుమతి ఇవ్వలేదని ఆయన తెలిపారు. ఈ క్రమంలో ఎస్సీ వర్గీకరణ పై తమ అభిప్రాయాన్ని వైసీపీ ఇంకా చెప్పలేదు. ఎస్సీ వర్గీకరణ పై జగన్ వైఖరేంటో స్పష్టం చేయాలని అన్నారు. దళితుల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారా? అని ప్రశ్నించారు. సురేష్ ద్వారా జగన్ తన అభిప్రాయం చెప్పించారా అనే సందేహం వస్తోందని మందకృష్ణ మాదిగ అన్నారు. సీఎం చంద్రబాబు చతురత వల్లే తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. ఎస్సీ వర్గీకరణ విషయంలో చంద్రబాబు సామాజిక న్యాయం చేశారని మందకృష్ణ మాదిగ వ్యాఖ్యానించారు.

Next Story

Most Viewed