ఈ రోజు ఆ అదృష్టం కలిగింది: నారా లోకేశ్

by srinivas |   ( Updated:2025-03-23 11:39:11.0  )
ఈ రోజు ఆ అదృష్టం కలిగింది: నారా లోకేశ్
X

దిశ, వెబ్ డెస్క్: మంత్రి నారా లోకేశ్(Nara Lokesh) అమృత్‌సర్‌(Amritsar)లో పర్యటించారు. సతీమణి నారా బ్రాహ్మిణి(Nara Brahmini), కుమారుడు దేవాన్ష్(Devansh)తో కలిసి అక్కడకు వెళ్లిన ఆయన ప్రఖ్యాత స్వర్ణ దేవాలయాన్ని(Golden Temple) సందర్శించారు. ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పవిత్రమైన శ్రీ హర్మందిర్ సాహిబ్‌(Sri Harmandir Sahib)ను సందర్శించుకుని ప్రతి ఒక్కరికీ సుఖశాంతులు కలగాలని కోరుకున్నారు.

అయితే ఈ పర్యటనపై లోకేశ్ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. స్వర్ణ దేవాలయం వద్ద దిగిన ఫొటోలను షేర్ చేశారు. ఈ రోజు అమృత్‌సర్‌లోని పవిత్రమైన హర్మందిర్ సాహిబ్‌ను సందర్శించే అదృష్టం కలిగిందని మంత్రి చెప్పారు. శాంతి, అందరి శ్రేయస్సు కోసం ప్రార్థించానని తెలిపారు. స్వర్ణ దేవాలయం ప్రశాంతతకు స్ఫూర్తిదాయకమన్నారు. వాహెగురు ఆశీస్సులు మార్గనిర్దేశం చేస్తాయని లోకేశ్ పేర్కొన్నారు.

Next Story