- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
నాగ్సాన్ పల్లి గ్రామ కార్యదర్శి సస్పెన్షన్

దిశ, సంగారెడ్డి : నాగ్సాన్ పల్లి గ్రామ కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి సస్పెండ్ అయ్యారు. సదాశివపేట మండల పరిధిలోని నాగ్సాన్ పల్లి గ్రామ శివారులోని పలు వెంచర్లకు ఎలాంటి ఫైనల్ లేవుట్ లేకుండానే మార్టిగేజ్ జారీ చేశారనే తోడేలుగూడెంకు చెందిన ఎండి.అహ్మద్ అక్టోబర్ 8, 2024లో డీపీఓకు ఫిర్యాదు చేశారు. వెంచర్లకు ఫైనల్ మార్టిగేజ్ జారీ చేయడంపై పూర్తిగా విచారణ జరిపి నివేదిక అందించాలని సదాశివపేట ఎంపీఓకు కలెక్టర్ ఆదేశాలు ఇవ్వడంతో విచారించిన ఎంపీఓ వెంచర్ కు మార్టిగేజ్ జారీ చేసింది నిజమేనని నిర్ధారణ అయ్యింది. ఫిర్యాదుతో విచారణ చేపట్టిన ఎంపీఓ నవంబర్ 26, 2024లో నివేదికను అందజేశారు. 2025 జనవరి 25వ తేదీన మార్టిగేజ్ జారీ చేయడంపై ఎందుకు మార్టిగేజ్ జారీ చేశారనే విషయంపై వ్యక్తిగతంగా కలిసి వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసు జారీ చేశారు.
షోకాజ్ నోటీసు జారీ చేసి 26 రోజులు ముగిసిన కూడా ఎలాంటి వివరణ ఇవ్వకపోవడంతో నిర్లక్ష్యంగా వ్యవహరించినందున పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం నాగ్సాన్ పల్లి గ్రామ కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డిని మార్చి 5వ తేదీన సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు. సస్పెండ్ ఉత్తర్వులు తీసుకునేందుకు సైతం కార్యదర్శి సిద్ధంగా లేకపోవడంతో గ్రామ పంచాయతీ కార్యాలయంలో అందజేశారు. సస్పెండ్ అయిన గ్రామ కార్యదర్శి ఇప్పటి వరకు కూడా సస్పెండ్ ఉత్తర్వులను తీసుకోకపోవడమే కాకుండా తిరిగి ఉద్యోగంలో చేరేందుకు పైరవీలు చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. నాగ్సాన్ పల్లి గ్రామ శివారులో ఏర్పాటు చేసిన వెంచర్లలో ఎలాంటి అనుమతులు లేకపోయిన డీటీసీపీ ఫైనల్ లేవుట్ అప్రూవల్ లేకుండానే మార్టిగేజ్ జారీ చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
వెంచర్ ఏర్పాటు చేసిన తర్వాత అందులో ప్లాట్లు కొనుగోలు చేసే వారికి కనీస వసతులు కల్పించాల్సిన అవసరం ఉంటుంది. రోడ్లు, మురికి కాలువలు, నీటి వసతి, పార్కులు, క్రీడా వసతులు కల్పించిన తరువాతనే ఫైనల్ లేఅవుట్ అప్రూవల్ వస్తుంది. అది వచ్చిన తరువాతనే గ్రామ పంచాయతీ నుంచి అన్ని సౌకర్యాలు కల్పించారు..వీరికి ఫైనల్ డీటీసీపీ ఇవ్వాలని అధికారులకు తెలుపాల్సి ఉంటుంది. వెంచర్ కు ఫైనల్ డీటీసీపీ వచ్చిన తరువాతనే గ్రామ పంచాయతీ నుంచి మార్టిగేజ్ జారీ చేయాలి. కానీ వెంచర్లలో అవేమి చేయకుండానే గ్రామ కార్యదర్శి మార్టిగేజ్ ఇవ్వడం వల్ల జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు.