ఎయిర్ పిస్టల్ తో వ్యక్తి హల్​చల్​

by Sridhar Babu |
ఎయిర్ పిస్టల్ తో వ్యక్తి  హల్​చల్​
X

దిశ, తిరుమలగిరి : సికింద్రాబాద్ మారేడ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎయిర్ పిస్టల్ తో సంచరిస్తున్న నేరేడుమెట్ కు చెందిన వినోద్ అనే వ్యక్తిని శుక్రవారం రాత్రి పోలీసులు అరెస్టు చేశారు. రాత్రి సమయంలో ఆర్కేపురం వంతెన వద్ద ద్విచక్ర వాహనంపై వెళ్తున్న సమయంలో వికాస్ అనే వ్యక్తితో వినోద్ వాగ్వాదానికి దిగాడు. అదే సమయంలో వినోద్ వద్ద తుపాకీ ఉన్నట్లు గుర్తించి అందరూ భయాందోళనలకు గురయ్యారు. ఎయిర్ పిస్టల్ చూపుతూ బెదిరించడంతో అటుగా వెళ్తున్న కొంతమంది అతన్ని వారించారు.

దీంతో తుపాకీతో వినోద్ అక్కడ నుండి పారిపోతున్న క్రమంలో అతన్ని అనుసరించి మారేడ్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా నిందితుడు మాత్రం పక్షుల వేట కోసం ఎయిర్ పిస్టల్ తీసుకెళ్తున్నట్లు చెబుతున్నాడు. ఏది ఏమైనా నడి బజార్ లో చిన్న వివాదానికే ఒక వ్యక్తి ఎయిర్ పిస్టల్ తో బెదిరింపులకు పాల్పడడం నగరంలో కలకలం సృష్టించింది. రోజురోజుకు నగరంలో ఏదో ఒకచోట గన్ కల్చర్ పెట్రేగిపోతుండడంతో ఇలాంటి సంఘటనలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని నగర ప్రజలు కోరుతున్నారు.

Next Story

Most Viewed