CIBIL Score : సిబిల్ స్కోర్ పెంచుకోవడానికి ఈ చిట్కాలు.. పాటిస్తే సరి

by Nagaya |   ( Updated:2022-08-01 13:41:06.0  )
CIBIL Score : సిబిల్ స్కోర్ పెంచుకోవడానికి ఈ చిట్కాలు.. పాటిస్తే సరి
X

దిశ వెబ్‌డెస్క్: అసలే కరోనా కాలం, చాలా మందికి సరైన జీతాలు లేక అవస్థలు పడుతున్నారు. వీటికి తోడు ఇంతకు ముందు ఏవైన లోన్‌లు తీసుకుంటే, వాటికి అదనపు వడ్డీరేట్లతో జేబులు ఖాళీ అవుతున్నాయి. భవిష్యత్‌లో తమ సిబిల్ స్కోర్ తక్కువయితే ఎలాంటి రుణం రాదనే ఆందోళనతోనే చాలామంది లోన్‌లు సకాలంలో చెల్లిస్తున్నారు. అసలు ఈ సిబిల్ స్కోర్ అంటే ఏమిటి? దానికి వ్యక్తిగత రుణాలకు ఏంటీ సంబంధం? సిబిల్ లేకపోతే పర్సనల్ లోన్ ఇవ్వడానికి బ్యాంకులు మొండి కేస్తాయా? మరీ సిబిల్‌ స్కోర్‌ను తిరిగి పెంచుకోవడానికి ఎలాంటి మార్గాలున్నాయి.

సిబిల్ స్కోర్ అంటే ?

ఓ వ్యక్తి తీసుకునే రుణాన్ని వివిధ అంశాలను పరిగణలోకి తీసుకుని సిబిల్ స్కోరును క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నిర్వహిస్తుంది. సిబిల్ మొత్తం విలువను 1000 కి 550 నుంచి 600 వరకు ఉంటే మంచిదని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. 550 కి తగ్గితే బ్యాంకులు మనకు రుణాలు మంజూరు చేయడానికి ఆసక్తి చూపకపోవచ్చు. బ్యాంకులకు, రుణగ్రహీతలను అంచనా వేయడానికి ఇదే కీలక సాధనం. స్కోర్‌ ఎంత ఎక్కువ ఉంటే అంత సులభంగా రుణం మంజూరవుతుంది. ఇది మన రుణ చరిత్రను ప్రతిబింబిస్తుంది. మీరు గతంలో తీసుకున్న రుణాలకు సంబంధించిన చెల్లింపుల వంటి ఆర్థిక లావాదేవీలను ఈ స్కోరు సూచిస్తుంది. తద్వారా ఆర్థిక అంశాలపై మీరు ఎంత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారో తెలిసిపోతుంది. అందుకే వివిధ రుణ సంస్థలు లోన్ కోసం దరఖాస్తు చేయగానే మన సిబిల్ స్కోర్‌ను సేకరిస్తాయి. వాటి ఆధారంగానే ఎంత మొత్తంలో రుణం ఇవ్వాలి, పరిమితి, వడ్డీరేట్లను నిర్ణయించుకుంటాయి.

మరీ పర్సనల్ లోన్ ఎలా?

వ్యక్తిగత రుణాలు ఎలాంటీ తనఖాలు లేకుండా వివిధ రుణ సంస్థలు మంజూరు చేస్తాయి. వాటికి ప్రధాన ఆధారం ఈ సిబిలే. అయితే ఇది తక్కువగా ఉన్న రుణం ఇచ్చే వివిధ డిజిటల్ సంస్థలు ఉన్నాయి. అయితే ఇవి ఎక్కువ వడ్డీ మొత్తంతో రుణాలు మంజూరు చేస్తాయి. మరి కొన్ని రుణ సంస్థలయితే ఏకంగా సిబిల్ స్కోర్ తక్కువగా ఉన్న వారికే రుణాలు మంజూరు చేస్తున్నాయి. అయితే షరతులు వర్తిస్తాయనుకోండి. అయితే రుణం తీసుకున్నాక సక్రమంగా చెల్లించాలి. అలా చెల్లిస్తే మీ వ్యక్తిగత స్కోర్ పెరుగుతుంది. మొదటి సారి రుణం తీసుకోవాలనుకునే వారికి, సిబిల్ స్కోర్ తక్కువగా ఉన్న వారికి డిజిటల్ రుణ సంస్థలను ఆశ్రయించటం మేలు. ఇలాంటి సంస్థలు మన వ్యక్తిగత మొబైల్‌కు వచ్చే వివిధ బ్యాంకు లావాదేవీల ఎస్ఎంఎస్‌ల ద్వారా రుణాన్ని మంజూరు చేస్తాయి.

Advertisement

Next Story