- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాజస్థాన్‌లో వీకెండ్ కర్ఫ్యూ.. యూపీలో బోర్డు ఎగ్జామ్స్ వాయిదా
జైపూర్ : కరోనా కట్టడికి ఒక్కో రాష్ట్రం ఆంక్షల వలయాన్ని గీస్తున్నది. మహమ్మారిని అరికట్టడానికి మరో మార్గం లేకపోవడంతో అన్ని రాష్ట్రాలు వీకెండ్ కర్ఫ్యూలు, పాక్షిక లాక్‌డౌన్‌లు, కఠిన ఆంక్షలతో కూడిన నైట్ కర్ఫ్యూలు పాటిస్తున్నాయి. ఇప్పటికే దేశంలో మహారాష్ట్ర, ఢిల్లీ, కర్నాటక, పంజాబ్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలు ఆ ఆంక్షలను అమలుచేస్తుండగా తాజాగా ఆ జాబితాలో రాజస్థాన్ కూడా చేరింది. రాజస్థాన్ లో వీకెండ్ కర్ఫ్యూ (శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 5 గంటల దాకా) విధించనున్నారు. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. కర్ఫ్యూ సమయంలో అత్యవసర సేవలు మినహా మిగతావన్నీ మూసే ఉంటాయని ఆయన తెలిపారు.
గురువారం రాజస్థాన్ లో 6,658 కేసులు నమోదుకాగా.. 33 మంది మరణించారు. ఈ నేపథ్యంలతో కఠిన చర్యలు తీసుకోకపోతే రాష్ట్రంలోనూ ఇతర రాష్ట్రాల మాదిరిగా కేసులు పెరిగే అవకాశం ఉందని, అందుకే ఈ ఆంక్షలు విధిస్తున్నామని గెహ్లాట్ పేర్కొన్నారు. ఉప ఎన్నికలు (శనివారం) జరుగుతున్న సహారా (బిల్వారా), సుజంగఢ్ (చురు) లలోనూ కర్ఫ్యూ ఆంక్షల నుంచి మినహాయింపునిచ్చారు. ఉత్తరప్రదేశ్ లో 10, 12 వ తరగతి పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దినేశ్ శర్మ తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. మే 20 వరకు బోర్డు పరీక్షలను వాయిదా వేసినట్టు ఆయన వివరించారు. అప్పటివరకు పరిస్థితులను సమీక్షించి.. పరీక్షలను రద్దు చేయడమా లేదా కొనసాగించడమా అనేది వెల్లడిస్తామని చెప్పారు.