- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
ఒక్క ఆంధ్ర విద్యుత్ ఉద్యోగిని రానివ్వం : శివాజీ
దిశ, న్యూస్ బ్యూరో:
ఒక్క ఆంధ్ర ఉద్యోగిని కూడా తెలంగాణకు రానీయమని, ఏపీ విద్యుత్ ఉద్యోగులను అక్కడి నుంచి వచ్చేలా రిలీవ్ చేయడంపై సోమవారం హైదరాబాద్‌లోని విద్యుత్ సౌధలో, పలు విద్యుత్ కార్యాలయాల్లో ఆందోళనలు చేస్తామని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజినీర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీ హెచ్చరించారు. ఏపీ ఉద్యోగులను రిలీవ్ చేసిన ఆర్డర్ కాపీలను రేపటి నుంచి భోజన విరామ సమయంలో ప్రతి తెలంగాణ ఉద్యోగి తగలబెట్టాలని ఆయన పిలుపునిచ్చారు. రెండు రాష్ట్రాల మధ్య విద్యుత్ ఉద్యోగుల విభజన సమస్య ఆరేళ్లుగా నలుగుతోందని ఈ విషయంలో ఆంధ్ర విద్యుత్ సంస్థల యాజమాన్యాలు మొండిగా వ్యవహరిస్తున్నాయని అన్నారు. ఏపీ విద్యుత్ ఉద్యోగులను రిలీవ్ చేసిన ఆర్డర్ కాపీలను తెలంగాణ విద్యుత్ జేఏసీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని మింట్ కాంపౌండ్‌లో ఆదివారం తగలబెట్టారు. ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ.. సర్వీస్ రిజిస్టర్‌లో హోమ్ డిస్ట్రిక్ట్ ఉన్నవాళ్లను రిలీవ్ చేసి అనవసరంగా ఏపీ విద్యుత్ సంస్థలు తెలంగాణతో గిల్లికజ్జాలు పెట్టుకుంటున్నాయన్నారు. ఏపీ ప్రభుత్వానికి తెలియకుండా అక్కడి విద్యుత్ సంస్థలు సొంతగా నిర్ణయాలు తీసుకుంటున్నాయని విమర్శించారు.
tags : ts vidyut employees, ap power companies, protest at mint compound