JC Prabhakar Reddy : మీరు మారుతారా? లేదంటే నన్నే ఊరి నుండి తరిమేయండి : జేసీ ప్రభాకర్ రెడ్డి

by Y. Venkata Narasimha Reddy |
JC Prabhakar Reddy : మీరు మారుతారా? లేదంటే నన్నే ఊరి నుండి తరిమేయండి : జేసీ ప్రభాకర్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్ : మీరు మారుతారా లేదంటే నన్నే ఊరి నుండి తరిమేయండంటూ తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ ఎమ్మె్ల్యే(Tadipatri)జేసీ ప్రభాకర్ రెడ్డి(JC Prabhakar Reddy) తనదైన శైలీలో సొంత నియోజకవర్గం తాడిపత్రి పట్టణ వాసులకు వార్నింగ్ ఇచ్చారు. వీధుల్లో చెత్త వేయవద్ధంటే వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీధుల్లో చెత్త వేస్తే నీళ్లు, కరెంటు కట్ చేయిస్తానని హెచ్చరించారు. జరిమానా విధించాలా లేక చెత్తను మీ ఇంట్లో వేయించాలా అంటూ నిలదీశారు. బీటెక్ చదివిన యువతి దీపాంతలు అమ్ముకుని జీవిస్తుందని, నేను అభినందించానని, అయితే నేను ఇచ్చిన స్థలంలో కాకుండా రోడ్డుపైన పెట్టి వాటిని విక్రయిస్తుందని, ఇక బీటెక్ చదివి ఏం లాభమన్నారు. ద్విచక్ర వాహనాలను ఎక్కడ పడితే అక్కడే పెడుతున్నారని మండిపడ్డారు. చదువుకున్న వారు కూడా పారిశుధ్యం పరిరక్షణ చర్యలు పాటించకపోతే ఎలా అని ప్రశ్నించారు. పట్టణ ప్రజలు ఎక్కడపడితే అక్కడ చెత్త వేస్తే కఠిన చర్యలు ఉంటాయని సీరియస్ అయ్యారు.

స్వతహాగా ముక్కోపియైన తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తొలుత కాంగ్రెస్ పార్టీ నుంచి 1987 నుంచి ఆగస్టు 1992 వరకు మొదటిసారి తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించారు. ఆ తరువాత 2000 నుంచి 2005 వరకు రెండోసారి తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, 2005 అక్టోబర్ నుంచి అక్టోబర్ 2010 వరకు వైస్ చైర్మన్ గా పని చేశాడు. రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ ని వీడి టీడీపీలో చేరాడు. 2014లో తాడిపత్రి నియోజకవర్గం నుంచి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. 2019లో పోటీ చేయకుండా తన కుమారుడు అస్మిత్ రెడ్డిని ఎమ్మెల్యేగా పోటీ చేయించగా.. అతను ఓడిపోయాడు. 2021లో మున్సిపల్ ఎన్నికలలో పోటీ చేసి మరోసారి తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ ఎన్నికయ్యాడు.

Advertisement

Next Story