ఘనంగా అల్లు వారింట్లో పెళ్లి.. ప్రత్యేక ఆకర్షణగా మెగా ఫ్యామిలీ.. నెట్టింట వైరల్ అవుతోన్న ఫొటోలు

by Kavitha |   ( Updated:2024-11-15 16:04:51.0  )
ఘనంగా అల్లు వారింట్లో పెళ్లి.. ప్రత్యేక ఆకర్షణగా మెగా ఫ్యామిలీ.. నెట్టింట వైరల్ అవుతోన్న ఫొటోలు
X

దిశ, సినిమా: టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఇంట పెళ్లి బాజాలు మోగాయి. ఆయన పెద్ద కుమారుడు అల్లు బాబీ తనయుడు రామకృష్ణ తేజ్, సాయి సంజన వివాహ బంధంతో ఒకటయ్యారు. ఇక పెళ్లి హైదరాబాదులో ఘనంగా జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ పెళ్లికి మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్ దంపతులు, సినీ ప్రముఖులు హాజరై కొత్త జంటని ఆశీర్వదించారు. ప్రస్తుతం వీటికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక అల్లు అరవింద్ పెద్ద కొడుకు బాబీ ప్రస్తుతం గీతా ఆర్ట్స్‌లో డిస్ట్రిబ్యూషన్ బాధ్యతలు చూసుకుంటున్నారు.

ఇక అల్లు అర్జున్ విషయానికి వస్తే ప్రస్తుతం ‘పుష్ప 2’ మూవీతో బిజీగా ఉన్నాడు. స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 5న రిలీజ్ కానుంది. దీంతో సినిమా రిలీజ్‌ దగ్గరపడుతుండటంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.


Read More..

‘పుష్ప 2'లో నేను చిన్న పార్ట్ మాత్రమే.. ఇది ఒక ఛాలెంజింగ్ సినిమా.. తమన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Advertisement

Next Story

Most Viewed