నగరాన్ని సేఫ్ సిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యం…

by Shyam |
నగరాన్ని సేఫ్ సిటీగా  తీర్చిదిద్దడమే లక్ష్యం…
X

దిశ వెబ్ డెస్క్:
హైదరాబాద్‌ను అత్యంత సేఫ్ సిటీగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని మంత్రి కేటీఆర్ అన్నారు. పోలీసు ఉన్నతాధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ….హైదరాబాద్‌లో 10లక్షల సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రజలు గుమిగూడే ప్రతీ చోట సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని చెప్పారు.

శాంతి భద్రతల నిర్వహణలో సీసీ కెమెరాల పాత్ర కీలకమని ఆయన తెలిపారు. సైబర్ క్రైమ్ నేరాల పైన ప్రత్యేక దృష్టి సారించాలని పోలీసులకు ఈ సందర్బంగా ఆయన సూచించారు. కాగా సీసీ కెమెరాల ఏర్పాటు తర్వాత నేరాల సంఖ్య గణనీయంగా తగ్గిందని పోలీసులు ఉన్నతాధికారులు తెలిపారు.

Advertisement

Next Story