విశాఖ స్టీల్ ప్లాంట్ పై పోరాటం చేస్తాం : మిథున్ రెడ్డి

by srinivas |
MP Mithun Reddy
X

దిశ, వెబ్ డెస్క్: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని వైసీపీ లోక్‌సభాపక్ష నేత మిథున్‌ రెడ్డి తెలిపారు. సోమవారం జరిగిన లోక్‌సభ బీఏసీ సమావేశానికి హాజరైన ఆయన రాష్ట్ర సమస్యలను ప్రస్తావించేందుకు అధిక సమయం ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. అందుకు లోక్‌సభ స్పీకర్ సానుకూలంగా స్పందించారన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రధానికి సీఎం జగన్ లేఖ రాశారని గుర్తు చేశారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ ఎంపీలంతా కేంద్రమంత్రులను కలిసినట్లు తెలియజేశారు. అలాగే పోలవరం ప్రాజెక్ట్‌కు నిధులన్నీ కేంద్రమే భరించాలని.. అలాగే సవరించిన అంచనాలను ఆమోదించాలని కోరినట్లు తెలిపారు. పోలవరం, విశాఖ ఉక్కు అంశాలపై పార్లమెంట్‌లో పోరాటం చేస్తామని మిథున్ రెడ్డి తెలిపారు.

Advertisement

Next Story