- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారత్ కు తాలిబాన్లు షాక్ .. పాక్ మా రెండో ఇళ్లు అంటున్న ఉగ్రమూకలు
కాబుల్: ‘పాకిస్తాన్ మాకు రెండో ఇల్లు’ అని తాలిబన్లు తెలిపారు. ఆ దేశంతో సాంస్కృతిక, మతపరమైన సంబంధాలను మెరుగుపర్చుకుంటామని స్పష్టం చేశారు. తాలిబన్ల అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ పాక్ మీడియాకు గురువారం ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘పాకిస్తాన్‌తో అఫ్ఘానిస్తాన్ సరిహద్దు పంచుకుంటుంది. మతపరమైన విషయానికొస్తే ఇరు దేశాలూ ఒకటే అవడంతో ప్రజలు సులభంగా కలిసిపోతారు. కావున, పాకిస్తాన్‌తో సంబంధాలు మరింత మెరుగుపర్చుకోవడంపై దృష్టిసారించాం’ అని చెప్పారు.
భారత్, పాక్ కూర్చుని మాట్లాడుకోవాలి
అఫ్ఘాన్ ప్రజల ప్రయోజనాల కోసం భారత్ తన విధానాలను రూపొందించుకోవాలనేది తమ అభీష్టమని తాలిబన్ ప్రతినిధి ముజాహిద్ అన్నారు. అలాగే, భారత్, పాక్ మధ్యనున్న కశ్మీర్ వివాదంపైనా స్పందించారు. కశ్మీర్ అంశంలో భారత్ సానుకూల దృక్పథాన్ని కలిగి ఉండాలని అన్నారు. ఈ అంశం భారత్, పాక్ కూర్చుని సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. ఎందుకంటే రెండు కూడా పొరుగుదేశాలని, ఇరువురి అభివృద్ధి ఒకరితో ఒకరికి ముడిపడి ఉంటుందని అభిప్రాయపడ్డారు.
మహిళల హక్కుల కోసం కృషి చేస్తాం
అఫ్ఘాన్‌లో త్వరలోనే తాలిబాన్ ప్రభుత్వం ఏర్పడనుందనే ఊహాగానాల మధ్య, ముజాహిద్ మాట్లాడుతూ అఫ్ఘాన్లందరూ భాగస్వాములుగా ఉండే సమగ్ర పరిపాలనను సృష్టిస్తామని చెప్పారు. ‘అఫ్ఘాన్‌లో ఏర్పడే ప్రభుత్వం బలమైనదిగా, ఇస్లాం ఆధారంగా ఉంటుంది. ఇందులో దేశ ప్రజలందరూ భాగమవుతారు. దానిపైనే పని చేస్తున్నాము. బలమైన, స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో విజయం సాధించేవరకు వేచి ఉండండి’ అని తెలిపారు. అలాగే, అఫ్ఘాన్ పౌరుల హక్కులు కాపాడుతామని, ముఖ్యంగా మహిళల హక్కులను రక్షిస్తామని చెప్పారు. మహిళలకు విద్య, ఉపాధి కల్పించేందుకు అనువైన వాతావరణాన్ని సృష్టించేందుకు యత్నిస్తున్నామని వెల్లడించారు. అలాగే, తమ దేశాన్ని ఇతర దేశానికి వ్యతిరేకంగా ఉపయోగించబోమని ఉద్ఘాటించారు.