సివిల్స్ అభ్యర్థులకు మరో అదనపు అవకాశం!

by Shamantha N |   ( Updated:2020-12-18 09:47:18.0  )
సివిల్స్ అభ్యర్థులకు మరో అదనపు అవకాశం!
X

న్యూఢిల్లీ: కొవిడ్-19 మహమ్మారి కారణంగా ఈ ఏడాది సివిల్ సర్వీస్ ప్రిలిమినరీ పరీక్షలకు హాజరుకాని వారికి మరో అదనపు అవకాశం ఇచ్చే విషయం తీవ్రంగా పరిశీలిస్తున్నామని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. సివిల్ సర్వీస్ రాయడానికి చివరి అవకాశం కలిగి ఉండి, కొవిడ్-19 కారణంగా అక్టోబర్‌లో ప్రిలిమ్స్ రాయలేకపోయిన అభ్యర్థులకు మరో అవకాశం కల్పించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై జస్టిస్ ఏఎం ఖన్విల్కర్ నేతృత్వంలోని బెంచ్ శుక్రవారం విచారణ జరిపింది.

కేంద్ర ప్రభుత్వం తరఫున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ.. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం, యూపీఎస్సీ తీవ్రంగా పరిశీలిస్తున్నాయనీ, తాము ఎలాంటి వ్యతిరేక చర్య తీసుకోవడం లేదని స్పష్టం చేశారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. కొవిడ్-19 తీవ్ర పరిస్థితుల కారణంగా ప్రిలిమ్స్‌కు హాజరు కాని అభ్యర్థులకు మరో అవకాశం ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు.

Advertisement

Next Story

Most Viewed