- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Tips for success :వాళ్లను మెప్పిస్తే మీరే కింగ్స్
దిశ, ఫీచర్స్ : సోషల్ మీడియాలో ఏ కంటెంట్ ఎప్పుడు, ఎందుకు వైరల్ అవుతుందో చెప్పలేం. ఈ క్రమంలో కొన్ని వీడియోలైతే భాష, ప్రాంతంతో సంబంధం లేకుండా వరల్డ్ వైడ్ పాపులర్ లిస్ట్‌లో చేరిపోతుంటాయి. అయితే, వైరల్ పోస్ట్‌ను సృష్టించడం వెనుక రాకెట్ సైన్స్ ఏం లేకున్నా.. ఇది తప్పకుండా ట్రెండ్ అవుతుందని చెప్పగలిగే చెక్ లిస్ట్ కానీ, గ్యారంటీడ్ రెసిపీ కానీ ఉండవు. ఏదేమైనా ఓసారి వైరల్ పోస్ట్‌లను గమనిస్తే, వాటికి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. నెటిజన్లు తమ నెట్‌వర్క్స్‌లో షేర్ చేసేందుకు అవే కారణమవుతాయి. దీన్ని అర్థం చేసుకుంటే సోషల్ మీడియాలో ఈజీగా సక్సెస్ సాధించొచ్చు. ఈ మేరకు వైరల్ కంటెంట్ సృష్టించడానికి ఎలాంటి మార్గాలున్నాయో సోషల్ మీడియా నిపుణులు అందించిన టిప్స్ మీ కోసం..
know your audience :
ఒక వీడియో లేదా ఆడియో పోస్ట్ చేసేముందు అసలు మనం ఏం చెప్పాలనుకుంటున్నాం, ఏ వయసు వారిని టార్గెట్ చేస్తున్నాం? అనే ప్రశ్నలు మనకు మనమే వేసుకోవాలి. వీక్షకుల ప్రాధాన్యతలు ఏమిటి? వారు ఏం చూడాలనుకుంటున్నారో అవగాహన ఉండటంతో పాటు చారిత్రాత్మకంగా వారు ఏ విధమైన పోస్ట్‌లు ఇష్టపడుతున్నారో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఆ ఇష్టాల ప్రకారంగా వీడియో రూపొందిస్తే వైరల్ కావడం తేలిక.
ఉదా : డైపర్‌ల కోసం ఒక ప్రకటన చేసి, దాన్ని టీనేజర్‌లకు మార్కెట్ చేయడానికి ప్రయత్నిస్తే ఎలా ఉంటుంది? బాగుండదు కదా! అందుకే తొలిగా ‘నో యువర్ ప్రొడక్ట్’ (మన ఉత్పత్తి గురించి తెలుసుకోవాలి). మార్కెట్‌లోని కొత్త కొత్త ట్రెండ్స్‌తో పాటు ప్రజలు ఇష్టపడే వాటిని అధ్యయనం చేయాలి. కాబట్టి పోస్ట్‌లు తెలియజేసే శైలి, టోన్(స్వరం) గురించి ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. వారి అభిరుచుల ఆధారంగా డిజైన్ చేసే పోస్ట్‌లతో వ్యూయర్స్‌కు పర్సనల్ కనెక్షన్ ఏర్పడుతుంది. దాంతో వాళ్లు చానల్ ఫాలోవర్‌గా మారిపోతారు.
Relevant Content :
వైరల్ కంటెంట్‌ను పరిశీలిస్తే, కరెంట్ ఈవెంట్స్‌కు అది రిలవెంట్‌గా ఉంటుంది. పర్టిక్యులర్ టైమ్‌లో ప్రజలు ఎంతో ఆసక్తితో సెర్చ్ చేస్తున్న లేదా మాట్లాడుతున్న అంశానికి మన కంటెంట్ దగ్గరగా ఉంటే, ఆటోమేటిక్‌గా వ్యూస్ పెరుగుతాయి. అంటే తాజా విషయాలను పబ్లిష్ చేయడం వల్ల తక్కువ టైమ్‌లోనే వైరల్ అయ్యే అవకాశం ఎక్కువ. ఇక అత్యంత ప్రాచుర్యం పొందిన విషయాలను ట్రాక్ చేయడానికి ట్విట్టర్ ఒక గొప్ప మార్గంగా ఉపయోగపడుతుంది. అందులో యూజర్లు ఎక్కువగా మాట్లాడుతున్న టాపిక్ ప్రకారం ట్రెండింగ్ విషయాలు, హ్యాష్‌ట్యాగ్‌లు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. తాజా, ట్రెండింగ్ న్యూస్‌ను పంచుకోవడానికి ప్రజలు ఉపయోగించే మొదటి వేదిక ఇదే.
ఎస్టాబ్లిష్ ఎమోషనల్ కనెక్షన్ :
టార్గెట్ ఆడియన్స్ ఏర్పడిన తర్వాత, వారిని ఎంగేజ్ చేయడానికి ఓ మార్గాన్ని అన్వేషించాలి. బోరింగ్ కంటెంట్ అనేది వ్యూయర్స్ ఆసక్తిని తగ్గిస్తుంది. అదే టైమ్‌లో వారు ఇతరులకు షేర్ చేసేందుకు ఇష్టపడరు. ఇక చాలా వరకు వైరల్ పోస్ట్‌లు వీక్షకుల్లో బలమైన భావోద్వేగాలను రేకెత్తిస్తాయి. అది ఎప్పటికీ కొనసాగేలా చేయాలి. మనం అందించే కంటెంట్.. కోపం, భయం, ఆశ్చర్యం, అసహ్యం, ఆనందం, విచారం వంటి ఆరు ప్రాథమిక భావోద్వేగాల్లో దేన్నయినా ప్రేరేపించేలా ఉండాలి. అలా చేస్తేనే ఆడియెన్స్‌కు రీచ్ అవుతాం. అంతేకాదు ప్రేక్షకులతో మానసికంగా కనెక్ట్ అయ్యే కంటెంట్‌కే వైరల్ అయ్యే అవకాశం ఎక్కువ. అందుకే వైరల్ పోస్ట్‌ల్లో తరచుగా హాస్యాస్పద లేదా హార్ట్ టచింగ్ కంటెంటే కనిపిస్తుంది.
Useful content :
పోస్ట్‌ను వైరల్‌గా మార్చడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, సదరు కంటెంట్ వీక్షకులకు విలువైన సమాచారాన్ని అందిస్తుందా లేదా తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే చాలామంది నెటిజన్లు కంటెంట్‌లో యూజ్‌ఫుల్ ఇన్‌ఫర్మేషన్ ఉందని భావిస్తే.. తమ స్నేహితులు, బంధువులకు విస్తృతంగా షేర్ చేస్తారు. అయితే ఉపయోగకరమైన కంటెంట్‌ను కలిగి ఉండటం మాత్రమే సరిపోదు, వీక్షకులతో భావోద్వేగ సంబంధాన్ని కొనసాగిస్తున్నారని నిర్ధారించడానికి తరచుగా చెక్ చేసుకోవడం, ఫీడ్ బ్యాక్ తీసుకోవడం ప్రధానం. వీక్షకులు అందించే ఇన్‌పుట్స్ ఆధారంగా వీడియోలు చేయడం కూడా వైరల్ అయ్యేందుకు ఉపయోగపడతాయి.
Video content:
టెక్స్ట్ పోస్ట్‌లు వైరల్ అయ్యే అవకాశం చాలా తక్కువ. ఇక వీక్షకులను నిమగ్నం చేయడంలో, పోస్ట్ విలువను పెంచడంలో ఆకర్షణీయమైన విజువల్స్ కీలకం. ఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్(ల)ను ఉపయోగించుకున్నా, కొన్ని సంబంధిత చిత్రాలను జోడించడం వల్ల ఆ పోస్ట్ క్లిక్ అయ్యే అవకాశాలు పెరుగుతాయి,
అట్రాక్ట్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ :
ఇన్‌ఫ్లుయెన్సర్స్‌తో మంచి బాండింగ్ పొందడానికి ప్రయత్నించాలి. ఇందులో భాగంగా వారి పోస్ట్‌లను షేర్ చేయడం, వాటిని మీ చానల్ ఫాలోవర్స్‌కు సిఫార్సు చేయడంతో పాటు ఇన్‌ఫ్లుయెన్సర్స్‌తో సంభాషణను ప్రారంభించడానికి ప్రయత్నించాలి. ఇలా చేయడం వల్ల వాళ్లు రెస్పాండ్ అవుతారని చెప్పలేం. కానీ ఇది వారి దృష్టిని ఆకర్షించే అవకాశముంది. వారికి కంటెంట్ నచ్చితే అడగకుండానే షేర్ చేయడం వల్ల, తక్కువ టైమ్‌లోనే ఎక్కువమందికి రీచ్ కావచ్చు.
ఇవే కాదు.. వేలాది మంది ఇన్‌ఫ్లుయెన్సర్స్, కంటెంట్ క్రియేటర్స్ నుంచి నిన్ను వేరు చేసే అంశం లేదా వారికంటే ఎందులో భిన్నం అనే అంశం చాలా ముఖ్యం. దాంతో పాటు మనం పోస్ట్ చేసే టైమింగ్ కూడా ఇంపార్టెంట్. తెల్లవారుజామున మూడు గంటలకు ప్రకటనను ఎవరు చూడగలరు? అందుకే ఆన్‌లైన్‌లో జనాలు ఎక్కువగా ఉన్న టైమింగ్‌లోనే పోస్ట్‌లను షెడ్యూల్ చేయాలి. అనుభవపూర్వకంగా ఆ టైమింగ్ తెలుసుకోవాలి. ఈ మేరకు వీక్షకులతో ఇంటరాక్ట్ అవుతూ వారి ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ ఉండాలి. క్వాంటిటీపై దృష్టి పెట్టకుండా, క్వాలిటీ మీద శ్రద్ధ పెట్టాలి. ప్రజల భావోద్వేగాలతో ఆటలాడకుండా నీట్ కంటెంట్ ఇవ్వడం ఇంపార్టెంట్. అంతేకాదు ఇస్తున్న కంటెంట్‌లో రాజకీయాలు, మత లేదా సొంత భావజాలాలను మిక్స్ చేయకపోవడమే ఉత్తమం. ఫైనల్లీ కాన్‌స్టెంట్‌గా ఉండాలి.
ఈ చిట్కాలను పాటించడం మీ సోషల్ మీడియా గేమ్‌లో మీకు సహాయపడుతుంది. ఎవరికి తెలుసు, రాబోయే కాలంలో ట్రెండింగ్ పేజీలో మీ పేరూ ఉండొచ్చు.