- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ధోనీని కూడా ఎత్తుకొని గ్రౌండ్ అంతా తిప్పాలి: శ్రీశాంత్
దిశ, స్పోర్ట్స్: భారత క్రికెట్ జట్టు 28ఏళ్ల తర్వాత వన్డే ప్రపంచకప్ గెలిచి వాంఖడే స్టేడియంలో సచిన్ టెండుల్కర్‌ను ఆటగాళ్లంతా భుజాలపై ఎత్తుకొని తిప్పిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు టీ20 ప్రపంచ కప్ తర్వాత కూడా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీని అలాగే తిప్పాలని క్రికెటర్ శ్రీశాంత్ అంటున్నాడు. ఏడేళ్ల నిషేధం తర్వాత మరో రెండు నెలల్లో క్రికెట్‌లోకి పునరాగమనం చేయనున్న శ్రీశాంత్ క్రికెట్ అడిక్టెర్ అనే కార్యక్రమంలో పలు విషయాలు వెల్లడించాడు. ‘మహీ భాయ్ రాబోయే ప్రపంచకప్ తప్పకుండా ఆడాలి. ఈ ఏడాది తప్పకుండా పొట్టి ప్రపంచకప్ జరుగుతుందని అనుకుంటున్నాను. అతని రిటైర్మెంట్ గురించి అందరూ మాట్లాడుతున్నారు. కానీ, అతడి బ్యాటింగ్ మరోసారి చూసే అవకాశం అందరికి వస్తుంది. అతను తప్పకుండా మెగా టోర్నీ ఆడి మన కలలను నిజం చేస్తాడు’ అని శ్రీశాంత్ అన్నాడు. భారత క్రికెట్‌కు సచిన్ ఎంత చేశాడో, ధోనీ కూడా అంతే చేశాడని, అతడు క్రికెట్ నుంచి సగర్వంగా వైదొలగేలా వీడ్కోలు ఇవ్వాలని శ్రీశాంత్ కోరాడు. కాగా, నిషేధం తర్వాత కేరళ రంజీల్లో ఆడనున్న శ్రీశాంత్ భవిష్యత్‌లో భారత్ తరఫున ప్రపంచకప్ ఆడాలని కోరుకుంటున్నాడు.