- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘VRO’ రద్దు.. టెన్షన్‌లో రైతులు?
దిశ ప్రతినిధి, కరీంనగర్ : రెవెన్యూ ప్రక్షాళనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం వీఆర్ఓ వ్యవస్థను రద్దు చేసింది. దీంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న వీఆర్ఓ పోస్టులు రద్దయ్యాయి. పోస్టుల రద్దుతో ఇటు అధికారులు, అటు పనుల కోసం లంచాలు ఇచ్చిన బాధితుల్లో టెన్షన్ నెలకొంది. తమ భవిష్యత్ ఏమవుతుందోననే సంశయంలో ఉద్యోగులు ఉంటే..పనుల కోసం వేలకు వేలు లంచాలు ఇచ్చిన డబ్బులు మొత్తం వృథాగా మారబోతున్నాయని బాధిత రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పోస్టింగ్ ఎక్కడ..?
ఒక వేళ వేరే శాఖకు అలాట్ చేస్తే రెవెన్యూ విభాగంలో చేసిన సీనియారిటీని పరిగణనలోకి తీసుకుంటారా లేదా అన్న సంశయంలో కొట్టుమిట్టాడుతున్నారు. వేరే శాఖలో తమకు ఎలాంటి విధులు ఏం కెటాయిస్తారు? వాటిపై పూర్తిగా అవగాహన పొందడం ఎలా అన్న తర్జన భర్జన పడుతున్నారు.
రైతులదో అవస్థ..
వీఆర్వోల పరిస్థితి ఇలా ఉంటే రైతుల ఆందోళన మరీ దయనీయంగా తయారైంది. తమ భూములకు సంబంధించిన భూముల సమస్యలు పరిష్కరించుకోవడం ఎలా అని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టాదారు కాలంలో పేర్లు మారిన అంశమే అయినా, విరాసత్ కోసం దరఖాస్తులు చేసుకున్నామని ఆ పనుల కోసం వీఆర్‌ఓల చుట్టూ తిరుగుతున్నామని రైతులు వాపోతున్నారు.
మ్యూటేషన్ వంటి సమస్యలు కూడా పెండింగ్‌లో ఉన్నాయని వాటిని పరిష్కరించేదెవరని ప్రశ్నిస్తున్నారు. కొంతమంది రైతులు వీఆర్‌ఓల చేతికి డబ్బులు కూడా ఇచ్చినట్టు ప్రచారం జరుగుతున్నది. తమ పని పూర్తి కాక, డబ్బులు తమకు ఇవ్వక పోవడంతో రెండు విధాల నష్టపోయామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న తమ సమస్యల పరిష్కారంపై స్పష్టత ఇవ్వడంతో పాటు అన్ని విధాలా న్యాయం జరిగేలా చూడాలని కోరుతున్నారు.
Read Also..